Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది.. కొన్నిసార్లు తెలిసి, మరికొన్నిసార్లు తెలియక చేసిన తప్పులు కూడా మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయి.. ఈ పోటీ ప్రపంచంలో డబ్బులు, సంపాదన కోసం పరుగులు పెడుతూ.. ఆరోగ్యాన్ని కూడా సరిగా పట్టించుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకమంది ఉన్నారు.. వైద్యుల అంచనాల ప్రకారం.. సగటున 100 మందిలో 70 మంది రక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే అంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేసి.. పెద్ద జబ్బులు కొనితెచ్చుకుంటున్నారు.. ఇదంతా సరే.. ఇంతకీ.. మీరు ఆరోగ్యవంతులేనా..? అనే విషయం తెలుసుకోవడం.. దాని కోసం ఫుల్ బాడీ చెకప్ అవసరం లేదు.. ఇంట్లో ఉండే.. చెక్‌చేసుకోవచ్చు..
ఇంట్లో ఉండి.. ఎలాంటి చెకప్ అవసరం లేకుండా.. ఆరోగ్యంగా ఉన్నామా? అని ఎలా తెలుసుకుంటాం? అనే ప్రశ్న మీకు తట్టొచ్చు.. ముఖ్యంగా ఆరు ప్రధాన లక్షలణాలను మీరు గుర్తిస్తే.. మీ ఆరోగ్యం గురించి మీరే తెలుసుకోవచ్చు.. ఇక, అవి ఏంటి? అనే విషయాల్లకి వెళ్తే.. 1. బాగా నిద్ర పోవడం, 2. సరిగ్గా ఆకలి వేయడం తోపాటు తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణం కావడం, 3. రోజూ మల విసర్జన సాఫీగా కావడం, 4. పొట్ట కన్నా ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉండటం, 5. చేసే పనిని ఎంజాయ్ చేయడం, 6. ఎప్పుడూ సంతోషంగా ఉండటం.. ఈ లక్షణాలు ఉంటే చాలు మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులని వైద్యులు చెబుతున్నమాట.. అంటే.. ఈ లక్షణాలో మీలో ఉన్నాయా? లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టు అయితే.. మీ ఆరోగ్యం దెబ్బతిన్నట్టే అంటున్నారు..
అసలు ఈ ఆరు లక్షణాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే.. ఆరోగ్యంగా ఉన్నవారు రాత్రిపూట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నిద్ర పోతారు. రాత్రిపూట పడుకో గానే హాయిగా నిద్రలోకి జారుకుంటారు.. ప్రతి రోజూ 7 నుంచి 8 గంటల పాటు చక్కని నిద్ర పోగలిగినవారు ఆరోగ్యవంతులని వైద్యులు చెబుతున్నారు.. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉండవలసిన మరో లక్షణంలో కీలకమైనది ప్రతిరోజూ ఉదయం లేవగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మలవిసర్జన జరిగిపోవాలి… ఉదయం కాకపోయినా.. రోజు ఒక్కసారైనా సాఫీగా ఈ ప్రక్రియ సాగాలి అంటున్నారు.. ఇక, మూడోది సరైన ఆకలి.. అంటే పెట్టింది శుభ్రంగా తినడం, ఆ తర్వాత ఎటువంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు లేకుండా తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం. ఇక ప్రతిరోజూ చక్కగా ఆకలి వేసే వారికి, తిన్న ఆహారం అరిగించుకునే వారికి ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి ఉండవలసిన లక్షణాలలో అతి ప్రధానమైన లక్షణం అంటున్నారు. మరో ముఖ్యమైన లక్షణం.. మీరు చేస్తున్న పని ఎంజాయ్ చేస్తూ నిర్వహించడం.. అంటే ఆ పనిలో మానసికంగా తృప్తిని పొందుతున్నారా? లేదా? అనేది కూడా చూసుకోవాలి.. మరో ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలోకి వెళ్తే.. ఆరోగ్యవంతులైనవారి పొట్ట చుట్టుకొలత కన్నా.. ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉండాలి.. పొట్ట కన్నా చాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉంటే, పొట్ట కొలత తక్కువగా ఉంటే.. వారు ఆరోగ్యంగా ఉన్నట్టే అన్నమాట.. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు అనేది కూడా ముఖ్యమైనదే.. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకుండా.. అందరితో కలిసి మెలిసి ఉంటాఊ.. సంతోషంగా ఉండడం ఆరోగ్యవంతుల మరొక ముఖ్యమైన లక్షణంగా చెబుతున్నారు వైద్యులు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.