Tagatose : డయాబెటిస్ బాధితులకు ‘స్వీట్’ న్యూస్.. చక్కెరలా రుచి.. కానీ రిస్క్ కాదు.!
- టాగటోజ్.. మధుమేహులకు తీపి ఆశ
- కేలరీలు తక్కువ, ప్రోబయోటిక్ లాభాలు
- చవకైన బయోసింథటిక్ ఉత్పత్తి విధానం
- ఆహార పరిశ్రమలో విప్లవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, కానీ టాగటోజ్ విషయంలో అలాంటి ప్రమాదం ఉండదు.
టాగటోజ్ అనేది పండ్లు , పాల ఉత్పత్తుల్లో చాలా తక్కువ పరిమాణంలో లభించే అరుదైన చక్కెర. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకపోవడమే కాకుండా, సాధారణ చక్కెరతో పోలిస్తే ఇందులో 60 శాతం తక్కువ కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక వరంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది పళ్లు పుచ్చిపోవడానికి కారణం కాకపోగా, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందించే ప్రోబయోటిక్ గుణాలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు.
Also Read
- Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
- Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
India Final Warning to Apple: యాపిల్‌కు భారత్ ఫైనల్ వార్నింగ్.. రూ.3 లక్షల కోట్ల జరిమానా తప్పదా..?
ఇప్పటివరకు టాగటోజ్ ను తయారు చేయడం చాలా ఖరీదైన ప్రక్రియగా ఉండేది. సహజంగా ఇది చాలా తక్కువ పరిమాణంలో లభించడం వల్ల దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ‘E. coli’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి, గ్లూకోజ్ నుంచి నేరుగా టాగటోజ్ ను ఉత్పత్తి చేసే చవకైన బయోసింథటిక్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా 95 శాతం వరకు అధిక దిగుబడి సాధించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మనం రోజూ వాడే టీ, కాఫీలు, స్వీట్లు , కూల్ డ్రింక్స్‌లో పంచదారకు బదులుగా టాగటోజ్ ను తక్కువ ధరకు వాడుకునే అవకాశం కలుగుతుంది.
ఈ సరికొత్త ఆవిష్కరణ కేవలం మధుమేహులకు మాత్రమే కాకుండా, ఆహార ఉత్పత్తి రంగంలో కూడా పెద్ద మార్పులు తీసుకురానుంది. సాధారణంగా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ (Artificial Sweeteners) వంట చేసేటప్పుడు పంచదార లాగా మెత్తబడవు లేదా బ్రౌన్ కలర్‌లోకి మారవు. కానీ టాగటోజ్ అచ్చం పంచదార లాగే పనిచేస్తుంది. దీనిని కేకులు, బిస్కెట్లు తయారీలో కూడా వాడుకోవచ్చు. రుచిలో మార్పు లేకుండానే మధుమేహం , ఊబకాయం వంటి సమస్యలను అరికట్టడానికి ఈ టాగటోజ్ ఒక పటిష్టమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టాగటోజ్ ఉత్పత్తి సామాన్యులకు అందుబాటులోకి వస్తే, తీపి పదార్థాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. మధుమేహులు సైతం భయం లేకుండా తీపిని ఆస్వాదించే రోజులు అతి త్వరలోనే రానున్నాయి.
Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!