ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes) ఒక పెను సవాలుగా మారిన తరుణంలో, అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరిశోధనను విజయవంతం చేశారు. తీపిని ఇష్టపడే మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ చక్కెర (సుక్రోజ్)కు ప్రత్యామ్నాయంగా ఈ టాగటోజ్ ను వాడుకోవచ్చు. ఇది రుచిలో పంచదారకు దాదాపు 92 శాతం సమానంగా ఉంటుంది, కానీ శరీరంలోకి చేరాక అది చూపే ప్రభావం మాత్రం చాలా భిన్నంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణ చక్కెర తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు…