Weight Loss Discovery: ప్రపంచవ్యాప్తంగా నేడు లక్షలాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఊబకాయం వేగంగా విస్తరిస్తుంది. జీవనశైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసు పిల్లల్లో జంక్ ఫుడ్ తినడం, టీనేజర్లలో ఒత్తిడి కారణంగా ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. వారి పరిశోధనలో ఒక కొత్త ఆవిష్కరణ కనిపెట్టారు. ఇది ఊబకాయంతో పోరాడుతున్న వారికి కొత్త ఆశను అందిస్తుందని వాళ్లు చెబుతున్నారు.
READ ALSO: Pakistan: భారత్‌పై పాకిస్తాన్ ఏడుపు.. ఆఫ్ఘనిస్తాన్‌ను మాపై వాడుతున్నారని ఆరోపణ..
MRAP2 ఆకలి ఆఫ్ చేస్తుంది..
శాస్త్రవేత్తలు పరిశోధన ప్రకారం.. వాళ్లు ఆవిష్కరించిన కొత్త ఆవిష్కరణ పేరు MRAP2. ఇది ఒక ప్రోటిన్. ఇది మెదడుల్లో ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ మెదడులోని MC4R గ్రాహకాన్ని సక్రియం చేస్తుందని వాళ్లు పరిశోధనలో కనుగొన్నారు. ఈ గ్రాహకం శరీరాన్ని తినడం ఆపమని సంకేతాన్ని ఇస్తుందని, ఈ సంకేతం బలపడినప్పుడు, ఆకలి నియంత్రణ సులభం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రోటీన్ కార్యాచరణను పెంచడం ద్వారా లేదా దాని పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడే మందులను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు అంటున్నారు.
ఈ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, దుష్ప్రభావాలు లేని చికిత్సను అభివృద్ధి చేయవచ్చని స్టాన్ఫోర్డ్ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అయితే ఇది మానవ పరీక్షలకు చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.
ఊబకాయం తగ్గించుకోవడానికి వీటిని ట్రై చేయండి..
జంక్ ఫుడ్ తగ్గించి, పండ్లు, కూరగాయలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చురుకైన జీవనశైలిని నిర్వహించడం చాలా అవసరం, ప్రతిరోజూ 30 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలని అంటున్నారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
READ ALSO: Maria Corina Machado: నా నోబెల్ ట్రంప్‌కే అంకితం..