మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో కొన్ని సందేహాలు, సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. అపోహలతో కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి వుంటుంది. అయితే అసలు అపోహలేంటి? వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం గురించి ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని నమ్మవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు
చాలామంది రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాల్సిందే అంటారు. అయితే ఇది అపోహ మాత్రమే అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని. శరీరంలో అధికశాతం ఉండేది నీరే. శరీరంలో జరిగే ప్రతి చర్యకూ నీరు కావాలి. మూత్రవిసర్జన ద్వారా నీరు బయటకు పోయినా.. తిరిగి శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యం చేయాలంటే మంచినీరు తాగాల్సిందే. అయితే ఎనిమిది గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలనే నియమం లేదు. తాగే నీటితోపాటు మనం తీసుకునే ఆహారంలో ఉండే నీరు కూడా శరీరంలోకి వెళ్తుంటుంది. అది కూడా లెక్కలోకి తీసుకోవాలంటున్నారు వైద్యులు. మన శరీరం అవసరాన్ని బట్టి తాగే నీటి పరిమాణం ఎక్కువైనా, తక్కువైనా ఫర్వాలేదు. అలా అని అసలు నీరు తాగకపోతే డీ హైడ్రేషన్ జరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ట్రస్టెడ్ సోర్స్ ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తి రెండు సాధారణ పనులను చేయడం ద్వారా వారి రోజువారీ నీటి అవసరాలను తీర్చుకోవచ్చు: మీకు దాహం వేసినప్పుడు తాగడంతో పాటు భోజనంతో పాటు నీరు తాగడం చేయాలి.
చేతుల శుభ్రతకు వేడినీళ్లు
మనం ఏదైనా పట్టుకున్నా చేతులను శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లి వచ్చినా మనం నీటితో కాళ్లను, చేతులను శుభ్రం చేసుకుంటాం. చాలామంది వేడినీళ్లతో చేతులు కడుక్కుంటేనే సూక్ష్మక్రిములు పోతాయని అపోహపడుతుంటారు. నిజానికి వేడి నీళ్లు అవసరం లేదు. సాధారణ నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. శానిటైజర్ ద్వారా మాత్రమే చేతులు శుభ్రం కావు. సబ్బుతో చేతులను రుద్దుకుంటున్న సమయంలో ఉత్పత్తి అయ్యే వేడే సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వెళ్తుంటాయి. ఒకవేళ రోగకారక సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి వెళ్తే అస్వస్థతకు గురవుతాం.
పురుషులకు మాత్రమే గుండెపోటు?
గుండెపోటు కేవలం పురుషులకే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఎక్కువగా మగవారికే గుండెపోటు రావడం చూస్తూ అలాంటి అపోహలకు గురవుతుంటారు. గుండెపోటుకు లింగ, వయసు భేదాలు లేవు. ఎవరికైనా గుండెపోటు వచ్చే ముప్పు ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో యువతలోనూ గుండెపోటు సాధారణమైందని, ముఖ్యంగా మహిళల్లోనూ పెరుగుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. 20 ఏళ్ల లోపు పిల్లలు కూడా హార్ట్ ఎటాక్ కి గురవుతున్నారు. కాబట్టి గుండెపోటు మగవారికి మాత్రమే వస్తుందనేది అపోహ మాత్రమే.
Read Also:Komatireddy Venkat Reddy: షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలోపడేశా.. పీసీసీ కమిటీలను పట్టించుకోను
సన్నగా ఉండేవారు ఆరోగ్యవంతులా?
చాలామందిలో ఉండే అపోహ ఇది. సన్నగా ఉంటేనే ఆరోగ్యం అని భావిస్తారు. లావుగా ఉండేవాళ్లు అనారోగ్యానికి గురవుతారని, సన్నగా ఉన్నవాళ్లు రోగాల బారిన పడరని కొంతమంది నమ్ముతుంటారు. అది అసత్యం. సన్నగా ఉండేవారు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. లావుగా ఉన్నవారిలో సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేసేవాళ్లూ ఆరోగ్యంగానే ఉంటున్నారు. అలాగే బక్కగా ఉన్నవాళ్లూ వ్యాధులకు గురవుతున్నారు. సన్నగా, లావుగా ఉండడం అనేది వారి శరీర తత్వం, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. శారీరక శ్రమ చేస్తూ తక్కువగా తినేవారు సన్నగా ఉంటారు. కొంతమంది లావుగా ఉన్నా యాక్టివ్ గా ఉంటారు.
మాంసాహారం తింటేనే బలంగా ఉంటారా?
ఇది ముమ్మాటికీ తప్పు. శాకాహారంలోనూ మంచి బలవర్థకం అయినవి వుంటాయి. శరీరం బలంగా ఉండాలంటే మాంసం తినాలని, అందులో లభించే మాంసపుకృత్తులు చాలా అవసరమని కొందరు భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో శాకాహారులు పెరిగిపోతున్నారు. మాంసం తినకపోయినా ఆరోగ్యకరమైన శరీరానికి కావాల్సిన ప్రొటిన్లు శాకాహారంలోనూ లభిస్తాయి. బీన్స్, పప్పు దినుసుల్లో ఇవి అధికంగా ఉంటాయి. సమతుల ఆహారం తింటూ వ్యాయామం చేస్తే శరీరం దృఢంగా మారుతుంది. మాంసాహారం, శాకాహారం ఏదైనా అందులో ఉండే పోషకాలే ప్రధానం.
వేళ్లు పగలడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది
ఖచ్చితంగా చెప్పాలంటే వేళ్ళు పగలడం వల్ల ఆర్థరైటిస్ రాదు. అధ్యయనాల ప్రకారం అపోహను త్వరగా వదిలించుకోవాలి. కీళ్లలోని మృదులాస్థి విచ్ఛిన్నమైనప్పుడు ఆర్థరైటిస్ అభివృద్ధి చెందుతుంది. డౌన్ మరియు ఎముకలు కలిసి రుద్దడానికి అనుమతిస్తుంది. మీ కీళ్ళు సైనోవియల్ మెమ్బ్రేన్‌తో చుట్టుముట్టబడి ఉంటాయి, ఇది సైనోవియల్ ద్రవాన్ని కలిగి ఉంటుంది, ఇది వాటిని లూబ్రికేట్ చేస్తుంది మరియు వాటిని కలిసి గ్రైండ్ చేయకుండా నిరోధిస్తుంది. సైనోవియల్ మెంబ్రేన్ మీ కీళ్ళు పగుళ్లు రావడాన్ని సులభతరం చేస్తుంది. ఇది చేతి వాపునకు దారితీస్తుంది. అంతే తప్ప వేళ్ళు పగులడం వల్ల ఆర్థరైటిస్ రాదంటున్నారు డాక్టర్లు.
డర్టీ టాయిలెట్ సీట్ల ఎయిడ్స్ లాంటి వ్యాధులు వస్తాయా?
ఇది ఖచ్చితంగా తప్పు. అలా అని అసాధ్యం కాదు. అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్ సీట్ల వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధిని (STD) అందించే అవకాశం చాలా తక్కువ. అయితే ఆ వైరస్‌లు, బ్యాక్టీరియా లేదా పరాన్నజీవుల వల్ల STDలు సంభవించవచ్చు. ట్రైకోమోనియాసిస్ వంటి పరాన్నజీవి STDలు మాత్రమే మురికిగా ఉన్న టాయిలెట్ సీటుపై కూర్చోవడం ద్వారా సంక్రమించే నిజమైన అవకాశం ఉంది. పరాన్నజీవి ఇంకా సజీవంగా ఉన్నప్పుడు మీ జననేంద్రియ ప్రాంతం టాయిలెట్ సీటుతో కలిసినప్పుడు మీకు STD సంభవించవచ్చు. కాబట్టి బయట టాయిలెట్లు వాడేటప్పుడు జాగ్రత్ వహించండి. వాటిని శుభ్రపరిచారో లేదో పరిశీలించి ఉపయోగించడం శ్రేయస్కరం.
Read Also:Swami Vivekananda: యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ntvtelugu.com బాధ్యత వహించదు.