స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశం ప్రతి సంవత్సరం జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలివే.. 

రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

నీ వెనుక ఏముంది…ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.

 ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!

తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.

లేవండి ! మేల్కోండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.