Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి అనుసరించాలో తెలుసుకుందాం..
హైడ్రేషన్:
హైలురానిక్ యాసిడ్ సీరం వాడడం ద్వారా లోపలి నుండి తేమను అందించవచ్చు. ఇది చర్మాన్ని బొద్దుగా, మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా పెప్టైడ్లు కలిగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.
Also Read
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
రెటినోల్:
రెటినోల్ చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ముడతలు, పిగ్మెంటేషన్, నీరసాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని ఎక్కువ వాడకూడదు. వారానికి 2-3 సార్లు మాత్రమే వాడటం మంచిది. దీనిని రాసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు.
క్లెన్సర్:
వయసు పెరుగుతున్న సమయంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ. కాబట్టి హైడ్రేటింగ్, తేలికపాటి క్లెన్సర్‌ను వాడాలి. నురుగు లేదా సల్ఫేట్ కలిగిన క్లెన్సర్లు చర్మం సహజ నూనెలను తొలగించవచ్చు. బదులుగా క్రీమ్ లేదా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌ను వాడడం మంచిది.
సన్‌స్క్రీన్:
సూర్యుని UV కిరణాలు చర్మాన్ని త్వరగా వృద్ధాప్యం వైపు నడిపిస్తాయి. అందువల్ల SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలి.
ఆహారం:
చర్మ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ C, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. రోజుకు కనీసం 10 గ్లాసులు నీటిని త్రాగండి. పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం వల్ల చర్మానికి జీవం వస్తుంది.
నిద్ర, ఒత్తిడి :
ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ధ్యానం, యోగా వంటి మార్గాలు ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!