మీ ఇంట్లో వారికి సిగరెట్ తాగే అలవాటు ఉందా .. ? ఎంత చెప్పినా మానేయడం లేదా ? మీ ఇంట్లో తండ్రి , కొడుకు, సోదరులు లేదా మీ స్నేహితులకు ఇలాంటి అలవాటే ఉందా ? అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆ అలవాటు నుండి వారిని దూరం చేయొచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో పొగాకు ఒకటి. ఒకవైపు గాలిలో కాలుష్యం పెరిగి సగం ఆరోగ్యం దెబ్బతింటుంటే అది సరిపోనట్టు దానికి ఈ పొగాకు ఒకటి తోడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ధూమపానం చేస్తున్నారు. ఈ వ్యసనం వల్ల ప్రతి సంవత్సరం 7 మిలియన్ల మంది చనిపోతున్నారు. ఇక మన భారతదేశంలో 106 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. ప్రపంచంలో పొగతాగేవారిలో 12% మంది భారతదేశంలోనే ఉన్నారంటే షాక్ అవ్వక తప్పదు మరి. పొగాకు భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.35 మిలియన్ల మందిని చంపుతుంది. సిగరెట్ పొగలో దాదాపు 400 టాక్సిన్స్ ఉంటాయి. పొగాకు 69 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది.
పొగాకు ఎంతటి ప్రమాదమో తెలుసుకున్నారు కదా . ఇక ఆ అలవాటు మానెయ్యడానికి తగిన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..
1. ఎండిన అల్లం
అల్లంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి, కాబట్టి ఎండిన అల్లం ముక్కలను నమలడం వల్ల ధూమపాన కోరికలను నివారించవచ్చు. చిన్న అల్లం ముక్కలను నిమ్మరసంలో నానబెట్టి, ఆపై మిరియాలు వేసి ఒక గిన్నెలో ఉంచండి. మీకు ధూమపానం చేయాలనే కోరిక లేదా పొగాకు నమలాలని అనిపించినప్పుడు ఈ అల్లం ముక్కను తీనిపియ్యండి చాలు.
2. అజ్వైన్
పొగాకు నమలాలి అని అనిపించినప్పుడల్లా కాస్త అజ్వైన్ తీసుకుని నమలాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొగాకు వ్యసనం నుండి బయటపడవచ్చు.
3. ఔషధ టీ
జటాస్మి, చామంతి, బ్రాహ్మిలను సమపాళ్లలో కలిపి ఒక గిన్నెలో ఉంచండి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, ఒక కప్పు వేడి నీటిని పోసి నెమ్మదిగా త్రాగాలి. ఇది ధూమపానం చేయాలనే కోరికను నివారించడానికి మీకు సహాయం చేస్తుంది.
4.తులసి
ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం 2-3 పుదీనా ఆకులను నమలడం వల్ల పొగాకు వ్యసనం తగ్గుతుంది. ఇది ప్రారంభ పొగాకు వాడకం వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
5.దాల్చిన చెక్కలు
పొగాకు ఉపయోగించాలనే కోరిక వచ్చినప్పుడు దాల్చిన చెక్క ముక్కను తినాలి . పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడానికి ఇది ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది.
6.రాగి పాత్రలో నీరు
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే రాగి పాత్ర అద్భుతంగా పనిచేస్తుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల పొగాకు వ్యసనాన్ని తగ్గించి, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించవచ్చు.