Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
- భోజనం తర్వాత నడక ఎంతో మంచిది.
- తేలికపాటి నడక జీర్ణక్రియ, షుగర్ కంట్రోల్‌కు హెల్ప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత నడిస్తే జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే, తిన్న వెంటనే నడవొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
షుగర్ నియంత్రణ, జీర్ణక్రియకు సహాయం:
భోజనం ముగిసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో 10 నుంచి 20 నిమిషాలు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, భోజనం తర్వాత తేలికపాటి నడక చేయడం వల్ల శరీరం గ్లూకోజ్‌ను మెరుగ్గా వినియోగించుకుంటుంది. దీని వల్ల భోజనం తర్వాత శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరగకుండా నియంత్రిస్తుంది.
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
- Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను దెబ్బతీస్తున్నాయి..
- Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. 'సూపర్ ఫుడ్' మునగాకుతో రాగి బొండాలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Health Tips: కిడ్నీలో రాళ్లు కరగడానికి బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
ఎలా నడవాలి.?
భోజనం చేసిన 10-15 నిమిషాల తర్వాత నడక ప్రారంభించాలి. నెమ్మదిగా లేదా మితమైన వేగంతో నడవాలి. వెంటనే పరుగులు, అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయొద్దు. మోకాళ్లు, పాదాలపై ఎఫెక్ట్ పడకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి. బ్యాలెన్సుడ్ ఫుడ్, తగిన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తిన్న తర్వాత నడకను అలవాటు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.
తిన్న వెంటనే అతి వ్యాయామం చేయొద్దు:
ఆహారం తిన్న కాసేపటి తర్వాతే నడక ప్రారంభిస్తే మంచిది. తిన్న వెంటనే నడిస్తే మన జీర్ణక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణక్రియ కోసం శరీరం ఎక్కువ రక్తప్రసరణను జీర్ణవ్యవస్థకు పంపిస్తుంది. అదే సమయంలో వేగంగా నడవడం, పరుగులు పెట్టడం, అధిక శ్రమతో కూడి వ్యాయామం చేస్తే కండరాలకు ఎక్కువ రక్త ప్రసరణ చేయాల్సి వస్తుంది. దీంతో జీర్ణ క్రియపై ప్రభావం పడుతుంది. భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వికారం వంటివి కలుగుతాయి.
తాజావార్తలు
-
Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
-
Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
-
Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
-
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!