Couple Relationship: ఇద్దరు మనుషులు, రెండు మనసులు, ఇరువురి కుటుంబాల కలయిక వివాహం అనేది. నిజానికి స్టార్టింగ్‌లో ప్రతి బంధం ప్రేమ, నమ్మకం, అవగాహనతో నిండి ఉంటుంది. కానీ కాలం గడిచేకొద్దీ, చిన్న విషయాలను విస్మరించినప్పుడు, అవి క్రమంగా భార్యాభర్తల మధ్య దూరానికి కారణమవుతాయి. తరచుగా భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి అకస్మాత్తుగా ఒకప్పుడు ఉన్నట్లు ఎందుకు లేరో, తమ మధ్య ఎందుకు కమ్యూనికేషన్ తగ్గిందో తెలియక, మునుపటిలాగా వారు తమతో ఎందుకు ఉండటం లేదో అని ఆలోచిస్తుంటారు. ఇవన్నీ కూడా దంపతుల మధ్య వారికే తెలియకుండానే ఒకరినొకరు ఒంటరిగా భావించేలా చేస్తాయి. ఈ స్టోరీలో భార్యాభర్తల మధ్య దూరానికి కారణం అయ్యే కీలక అంశాలను తెలుసుకుందాం.
* వివాహం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు మద్దతుగా ఉంటూ, ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకుంటారు. కానీ వారిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే, వారి చింతలు, కోపాలను పంచుకోకపోతే, అది వారి మధ్య అపార్థాలకు దారితీస్తుంది. అప్పుడు ఏర్పడే నిశ్శబ్దం నెమ్మదిగా వారి వివాహ బంధాన్ని క్షీణింపజేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, చాలా తక్కువగా అయినా సరే. అప్పుడే మీ మధ్య సమస్యలు సమసిపోడానికి అవకాశం ఉంటుంది.
* “నువ్వు ఎప్పుడూ అతిగా ఆలోచిస్తావు” లేదా “ఇంత చిన్న విషయాన్ని ఎందుకు సమస్యగా మారుస్తున్నావు?” వంటి మాటలు ఎదుటి వ్యక్తిని భావోద్వేగపరంగా కుంగదీస్తాయి. కాబట్టి మీ భార్య, లేదంటే భార్త… మీతో వారి భావాలను పంచుకున్నప్పుడల్లా, ముందు మీరు చేయాల్సింది వారు చెప్పే మాటలను మనసు పెట్టి వినడం. ఆ తర్వాత వారు చెప్పింది అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం కలహాల కాపురంగా కాకుండా, చక్కటి సంసార జీవితంగా కొనసాగుతుంది.
* ఒకరినొకరు ఇతర జంటలతో పోల్చుకోవడం కూడా చాలా చెడ్డ అలవాటు. కాబట్టి మీ భాగస్వామిని ఎప్పుడూ సరదాగా లేదా కోపంతో ఇతరులతో పోల్చకండి. ఈ అలవాటు మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది.
* ఎల్లప్పుడూ మీ భాగస్వామి కంటే పని, మొబైల్ ఫోన్లు, ఇతర కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చేస్తే మీ దాంపత్య జీవితంలో మీకే తెలియకుండా దూరం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బెటర్ ఆఫ్‌కు మీరు మీ మనసులో తనకు ఇచ్చే స్థానాన్ని వివరించేలా ఏదైనా చేయడం, కనీసం తనకు అర్థం అయ్యేలా చెప్పడం లాంటివి చేయండి. అప్పుడే మీ సంసార జీవితం సంతోషంగా ఉంటుంది.
READ ALSO: Odisha Flight Crash: ఒడిశాలో ఘోర ప్రమాదం.. చార్టర్డ్ ఫ్లైట్ కూలి