Rainy season : వర్షాకాలంలో మీ పాదాల రక్షణ కోసం ఈ టిప్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాలు వచ్చాయంటే చాలు బురద, కలుషితమైన నీరు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… పాదాలను కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం..
బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బకెట్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి ఒక స్పూను వంట సోడా, అదే పరిమాణంలో నిమ్మరసం వేసి కలిపి.. పాదాలను ఆ నీటిలో పెట్టాలి. కాసేపటి తర్వాత బయటికి తీసి కాటన్ వస్త్రంతో పాదాలు, వేళ్ల సందులను తడి లేకుండా తుడవాలి. అప్పుడే ఎటువంటి ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి…
Also Read
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
మీ పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడానికి రాత్రి పూట నిద్రపోయే ముందు.. పావు కప్పుకొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటాయి..
వెనిగర్ మీ పాదాలను క్లీన్ చేయడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అరబకెట్ గోరువెచ్చని నీటిలో అర మూత వెనిగర్ వేయాలి. ఆ నీటిలో పాదాలను కాసేపు ఉంచాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలపై మురికి, బ్యాక్టీరియా తొలగుతుంది..
కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం పొందాలంటే తేనెను వాడాలని నిపుణులు చెబుతున్నారు.. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనెను రాత్రి పూట రాసి, కొద్దిసేపయ్యాక కడగాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది..
ఇక చివరగా గుప్పెడు గులాబీ రేకులను తీసుకోని రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్ నూనె నీళ్లల్లో వేసి మరగ బెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక కాసేపు అందులో పాదాలను నాననివ్వండి. ఆపై ప్యూమిక్ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం తొలగి కోమలంగా మారతాయి… ఇక వర్షంలో తడిచిన ప్రతి సారి గోరు వెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి.. ఇలా చెయ్యడం వల్ల పాదాలు బాగుంటాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..