Health Warning Signs: చర్మంపై నిరంతర దురద ఈ వ్యాధికి సంకేతం కావచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Warning Signs: వ్యాధి రావడానికి ముందే దానికి సంబంధించిన పలు సూచనలు శరీరానికి ఇస్తుందని వైద్య నిపుణులు. ఆ సూచనలను పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తు్న్నారు. చర్మంపై నిరంతర దురద రావడం అనేది ఏ వ్యాధికి సంకేతం అనేది మీలో ఎంత మందికి తెలుసు. మూత్రపిండాల వ్యాధి సంభవించినప్పుడు, దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. అవి రక్తం, వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, సరిగ్గా పని చేయలేనప్పుడు, శరీరంలో వ్యర్థాలు, ద్రవాలు పేరుకుపోతాయని హెచ్చరిస్తున్నారు.
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. అలసట, బలహీనత, వాపు (ముఖ్యంగా ముఖం, కాళ్ళలో), నురుగు లేదా రక్తంతో కూడిన మూత్రం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన మూత్రపిండాల వ్యాధి రాబోతుంది అనే దానికి సాధారణ సంకేతాలు అని చెబుతున్నారు. ఈ వ్యాధి అనేది శరీరంలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని, ఇది అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి ముందుగానే చికిత్స చేయించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. ఈ వ్యాధికి డయాబెటిస్, అధిక రక్తపోటు అత్యంత సాధారణ కారణాలు అని వైద్యులు పేర్కొన్నారు.
నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం.. మూత్రపిండాలు శరీరం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగిస్తాయని వెల్లడించాయి. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడతాయని, ఎముకలను బలంగా ఉంచుతాయని, అలాగే రక్తంలో సరైన మొత్తంలో ఖనిజాలు ఉండేలా చూస్తాయని పేర్కొన్నారు. చర్మం పొడిబారడం, దురద అనేది ఖనిజ, ఎముక వ్యాధికి సంకేతం కావచ్చు అని చెబుతున్నారు. ఇది తరచుగా అధునాతన మూత్రపిండ వ్యాధితో పాటు వస్తుందని, లేదా మూత్రపిండాలు రక్తంలో ఖనిజాలు పోషకాల సరైన సమతుల్యతను కాపాడుకోలేనప్పుడు సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.
మూత్రపిండాలు వ్యర్థాలను, ద్రవాలను సరిగ్గా తొలగించలేనప్పుడు, శరీరంలో అదనపు ద్రవం పేరుకుపోతుంది. ముఖ్యంగా ముఖం (కళ్ళ చుట్టూ), పాదాలు, చీలమండలు, చేతుల్లో వాపు సంభవించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయని, ఇది కామెర్లుకు సంకేతం అని హెచ్చరించారు. మూత్రపిండాల వ్యాధి కూడా రక్తహీనతకు కారణమవుతుందని, దీనివల్ల చర్మం పసుపు రంగులోకి మారవచ్చని సూచించారు. మూత్రపిండాల వ్యాధి ఉంటే, చర్మంపై చాలా దురద వస్తుందని, దీని వలన చర్మంపై మచ్చలు లేదా దద్దుర్లు ఏర్పడుతాయని చెబుతున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: PM Modi: బీహార్ విజయంతో బెంగాల్‌కు లైన్ క్లియర్..
తాజావార్తలు
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!