వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు కూడా విరివిగా లభిస్తాయి.. మామిడిలో సహజ చక్కరలు ఉంటాయి.. అందుకే అవి తియ్యగా ఉంటాయి.. అయితే మామిడిని డైట్ లో ఉన్నవాళ్లు తినకూడదనీ, వాళ్లు తింటే మళ్లీ బరువు పెరుగుతారని ఒక అఫోహ ఉంది.. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మామిడిలో అనేక పోషకాలు ఉంటాయి.. రుచికరమైనవి మాత్రమే కాకుండా అవసరమైన పోషకాలతో కూడి ఉంటాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి.. అంతేకాదు చర్మ రక్షణకు కూడా తొడ్పడుతాయి.. వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి.. వాటిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. వీటిలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్ మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం ఉన్నాయి..
మామిడి పండ్లను తీసుకుంటే బరువు పెరుగుతారా అనేది చూస్తే.. నిజానికి మామిడిలో 150 కేలరీలు ఉంటాయి. చక్కెర కంటెంట్ కారణంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుందని చాలామంది నమ్ముతారు. కొన్ని భాగాల పరిమాణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం, ప్రత్యేకించి మీరు మీ క్యాలరీలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఇతర పండ్లతో పోలిస్తే మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అతిగా తీసుకోవడం మంచిది కాదు…. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని తినడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.