Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- ఇన్వర్టర్ పక్కన పేపర్లు, బట్టలు వద్దు
- గ్యాస్ సిలిండర్, మండే ద్రవాలకు దూరంగా ఉంచండి
- స్ప్రే బాటిళ్లతోనూ పొంచి ఉన్న ప్రమాదం
- గాలి, పొడి ప్రదేశంలోనే ఇన్వర్టర్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inverter Safety : విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ఇన్వర్టర్లు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ నిత్యావసరంగా మారాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోగానే క్షణాల్లో బ్యాటరీల ద్వారా విద్యుత్‌ను అందిస్తూ ఇళ్లను వెలిగించే ఈ పరికరాలు ఎంత ఉపయోగకరమో, వాటి నిర్వహణలో అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదకరంగా మారతాయి. ముఖ్యంగా ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఛార్జింగ్ అవుతున్నప్పుడు అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో వాటి పరిసరాల్లో ఉంచే కొన్ని వస్తువుల వల్ల అగ్నిప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు , తీవ్రమైన పేలుళ్లు సంభవించే అవకాశం ఉంది.
ఇన్వర్టర్ వద్ద పొరపాటున కూడా ఉంచకూడని వస్తువులు
ఇన్వర్టర్లు పనిచేసే సమయంలో వేడిని బయటకు పంపుతాయి కాబట్టి వాటి పరిసరాల్లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండటం చాలా అవసరం. అయితే చాలామంది స్థలం కొరత వల్ల ఇన్వర్టర్ల పక్కనే పాత కాగితాలు, వార్తాపత్రికలు, కార్డ్బోర్డ్ పెట్టెలు లేదా పత్రాలను పేర్చి ఉంచుతారు. ఇవి సులభంగా మంటలు అంటుకునే స్వభావం కలిగినవి కావడంతో చిన్నపాటి స్పార్క్ వచ్చినా పెద్ద అగ్నిప్రమాదానికి దారితీస్తాయి. అలాగే పాత బట్టలు, టవళ్లు, కర్టెన్లను ఇన్వర్టర్లపై లేదా పక్కన వేయడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోయి పరికరం అతిగా వేడెక్కుతుంది. దీనివల్ల ఇన్వర్టర్ పనితీరు దెబ్బతినడమే కాకుండా కాలిపోయే ప్రమాదం కూడా పెరిగిపోతుంది.
Also Read
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
మరికొందరు ఇంట్లో స్థలం లేదని ఇన్వర్టర్ పక్కనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉంచుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇన్వర్టర్లో ఏమైనా విద్యుత్ లీకేజీ లేదా షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ దెబ్బతిని, క్షణాల్లో ఊహించని రీతిలో పెద్ద పేలుడు సంభవించే ముప్పుంది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్ థిన్నర్లు, క్లీనింగ్ లిక్విడ్ల వంటి మండే ద్రవాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుత్ పరికరాలకు సమీపంలో ఉంచకూడదు.
స్ప్రే బాటిళ్లు, తేమ వల్ల పొంచి ఉన్న ముప్పు
ఇంట్లో వాడే రూమ్ ఫ్రెషనర్లు, క్రిమిసంహారక స్ప్రేలు లేదా డియోడరెంట్లు వంటి గ్యాస్ నిండిన స్ప్రే బాటిళ్లను ఇన్వర్టర్ల వద్ద ఉంచడం అస్సలు మంచిది కాదు. ఇన్వర్టర్ ఛార్జింగ్ వేడికి ఈ బాటిళ్లలోని గ్యాస్ వ్యాకోచించి ఒకేసారి పేలిపోయే ప్రమాదం ఉంది. వీటిని ఎప్పుడూ చల్లని ప్రదేశాలలో మాత్రమే భద్రపరుచుకోవాలి. అలాగే చెక్క పెట్టెలు, ఇతర గృహోపకరణాలను ఇన్వర్టర్ పైకప్పుగా లేదా చుట్టూ పేర్చడం వల్ల లోపల తయారయ్యే వేడి బయటకు వెళ్లలేక పరికరం పాడవుతుంది.
ఇక నీటి బకెట్లు, వాటర్ డబ్బాలు, తడి గుడ్డలను కూడా ఇన్వర్టర్కు దూరంగా ఉంచడం శ్రేయస్కరం. తేమ వల్ల లోపలి ఎలక్ట్రానిక్ విభాగాలు పాడైపోవడమే కాక విద్యుత్ షాక్ కొట్టే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ , బ్యాటరీ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యం.
పాటించాల్సిన ముఖ్యమైన భద్రతా నియమాలు
ఇన్వర్టర్లను ఎల్లప్పుడూ ఆరుబయట గాలి ధారాళంగా వీచే పొడి ప్రదేశాల్లో మాత్రమే అమర్చుకోవాలి. ముఖ్యంగా గాలి ఆడని మూసి ఉన్న ఆల్మారాలు లేదా క్యాబినెట్లలో వీటిని ఉంచకూడదు. బ్యాటరీలలో ఉండే రసాయన భాగాలు లేదా లిథియం-అయాన్ కణాలు అధిక వేడి వల్ల ‘థర్మల్ రన్అవే’ అనే ప్రక్రియకు గురై అగ్నిప్రమాదాలకు కారణమవుతాయని పరిశోధనలు కూడా హెచ్చరిస్తున్నాయి.
అందుకే ప్రతీ నెలా కనీసం ఒకసారైనా బ్యాటరీ వైర్లు, కనెక్షన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వైర్లు ఏమైనా దెబ్బతిన్నట్లు అనిపిస్తే తక్షణమే నిపుణుడైన ఎలక్ట్రీషియన్ ద్వారా మార్పించాలి. ఇన్వర్టర్ పరికరాన్ని నేరుగా వాల్ ప్లగ్ పాయింట్‌కే కనెక్ట్ చేయాలి తప్ప, ఎక్స్టెన్షన్ బాక్సులకు తగలబెట్టకూడదు. ఆకస్మికంగా ఓవర్‌లోడ్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ బాక్సులు వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ చిన్నపాటి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఇన్వర్టర్ల నుంచి ఎదురయ్యే భారీ ప్రమాదాల నుంచి మన ఇళ్లను, ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!