T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T-Shirt Hacks: అల్మారాలో చాలా రోజులుగా పడి ఉన్న పాత టీ-షర్ట్స్‌ను చాలామంది ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తుంటారు. ఎక్కువగా వాడటం వల్ల వాటి రంగు వెలిసిపోవడం, బట్ట వదులుగా మారడం లేదా వాటిని ధరిస్తే నచ్చకపోవడం వంటి కారణాలతో చాలా మందికి వాటిని పడేయాలని అనిపిస్తుంది. కానీ కాస్త క్రియేటివిటీ, ఒక కత్తెర ఉంటే చాలు.. అలాంటి పాత టీ-షర్ట్స్‌ను ఇంట్లో ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవచ్చు. ఈ వస్తువులను తయారు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంతకీ మన పాత టీ షర్ట్లతో ఏయే వస్తువులు తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాత టీ-షర్ట్‌తో స్టోరేజ్ బాస్కెట్, కిచెన్‌లో ఉపయోగించే పాట్ హోల్డర్, డోర్ డ్రాఫ్ట్ స్టాపర్, రీయూజబుల్ క్లాత్ బ్యాగ్ వంటి వాటిని సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పాత బట్టను రీయూజ్ చేయడంతో పాటు కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మరి పాత టీ-షర్ట్స్‌తో వాటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
1. స్టోరేజ్ బాస్కెట్
ఇంట్లో చిన్నచిన్న వస్తువులు ఎక్కడపడితే అక్కడ ఉండిపోతుంటే.. పాత టీ-షర్ట్‌తో చిన్న స్టోరేజ్ బాస్కెట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్టోరేజ్ బాస్కెట్‌ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా టీ-షర్ట్‌ను పొడవాటి, సన్నని బట్ట పట్టీగా కట్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఆ పట్టీ మధ్యలో కట్ కాకుండా ఒకే పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత బట్ట పట్టీని తాడులా చుట్టుకుంటూ గుండ్రటి ఆకారంలోకి మార్చుకోవాలి. ప్రతి పొరను ఫ్యాబ్రిక్ గ్లూతో అంటిస్తూ ముందుగా బేస్ తయారు చేసుకోవాలి. అనంతరం అంచులను క్రమంగా పైకి మడుస్తూ గ్లూతో కలుపుకుంటే బాస్కెట్ ఆకారం వస్తుంది. ఇందులో బొమ్మలు, బాత్రూమ్ వస్తువులు, చిన్న గృహోపకరణాలు వంటి వాటిని భద్రపరుచుకోవచ్చు.
2. కిచెన్‌లో పాట్ హోల్డర్
కాటన్ టీ-షర్ట్ బట్ట కొంత మందంగా, స్ట్రెచీగా ఉంటుంది. అందుకే దాన్ని మందపాటి క్లాత్ యార్న్లా మార్చుకుని కిచెన్‌లో ఉపయోగించే పాట్ హోల్డర్ తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే.. ముందుగా మీ టీ-షర్ట్‌ను పొడవాటి పట్టీలుగా కట్ చేసి వాటిని చుట్టి యార్న్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత క్రోషియా లేదా బుట్ట అల్లే విధానంతో మందంగా బుని పాట్ హోల్డర్ తయారు చేసుకోవచ్చు. దీని మందమైన పొరలు వేడి పాత్రలను పట్టుకునే సమయంలో చేతులకు కొంత రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.
3. డ్రాఫ్ట్ స్టాపర్
తలుపు కింద ఉన్న ఖాళీ నుంచి దుమ్ము, చల్లటి గాలి లేదా చిన్న పురుగులు ఇంట్లోకి వస్తుంటే.. పాత టీ-షర్ట్‌తో డ్రాఫ్ట్ స్టాపర్ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే.. టీ-షర్ట్‌తో పొడవాటి, వెడల్పాటి బట్ట పట్టీని కట్ చేసి ట్యూబ్ ఆకారంలోకి మార్చాలి. దాని లోపల పాత బట్టల ముక్కలు వంటి వాటిని నింపి, రెండు చివరలను గట్టిగా కుట్టాలి లేదా వాటిని మూసేయాలి. తయారైన ఈ స్టాపర్‌ను తలుపు లేదా కిటికీ కింద ఉంచితే అక్కడి ఖాళీని కవర్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో మీ ఇంట్లోకి దుమ్ము, గాలి లోపలికి రావడం కొంతవరకు తగ్గుతుంది.
4. క్లాత్ బ్యాగ్
పాత టీ-షర్ట్‌తో సులభంగా తయారు చేసుకోగల వస్తువుల్లో క్లాత్ బ్యాగ్ ఒకటి. ముందుగా టీ-షర్ట్‌కు ఉన్న చేతి భాగాలు, మెడ భాగాన్ని కట్ చేయాలి. అనంతరం కింది భాగాన్ని బలమైన ముడితో కట్టేయాలి లేదా కుట్టి మూసేయాలి. అంతే.. సింపుల్ రీయూజబుల్ క్లాత్ బ్యాగ్ రెడీ అవుతుంది. టీ-షర్ట్ బట్ట కొంత స్ట్రెచీగా ఉండటం వల్ల కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఇందులో పెట్టుకోవచ్చు. ఉపయోగించిన తర్వాత ఉతికి మళ్లీ మళ్లీ యూజ్ చేసుకోవచ్చు.
పాత బట్ట.. కొత్త ఉపయోగం
ఇకపై పాత టీ-షర్ట్ రంగు వెలిసిపోయిందని లేదా వాటిని యూజ్ చేయడం లేదని వెంటనే చెత్త బుట్టలో పడేయాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి క్రియేటివిటీతో వాటిని ఇంట్లో ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవచ్చు. దీనివల్ల పాత బట్టకు మరోసారి ఉపయోగం కల్పించడంతో పాటు.. అవసరమైన కొన్ని వస్తువులను ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్నట్టవుతుంది.
తాజావార్తలు
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!