September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది.
సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ
సెప్టెంబర్ మొదటి వారంలోనే వరుస సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా బ్యానర్లో తెరకెక్కిన ‘రోమాకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతిక సనీల్ కుమార్, సుమంత్ ప్రభాస్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అదే సమయంలో అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సహా’ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచాయి.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
‘ఎపిక్’, ‘మహేంద్రగిరి వారాహి’తో రెండో వారం సందడి
సెప్టెంబర్ రెండో వారంలోనూ పలు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా గతంలో వచ్చిన ‘బేబీ’ తర్వాత మరోసారి కలిసి నటించిన చిత్రం ‘ఎపిక్’. ఈ చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. ‘90s: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదే రోజున సుమంత్ నటించిన డివోషనల్ యాక్షన్ డ్రామా ‘మహేంద్రగిరి వారాహి’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి గోస్వామి, మాలవిక నాయర్, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’
సెప్టెంబర్ చివరి వారంపై నేచురల్ స్టార్ నాని సినిమా కన్నేసింది. చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా సెప్టెంబర్ బాక్సాఫీస్‌లో కీలకంగా మారనుంది.
డబ్బింగ్ సినిమాలతో మరింత పెరగనున్న పోటీ
తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా సెప్టెంబర్‌లో పలు డబ్బింగ్ చిత్రాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, తమిళ హీరో కార్తీ, నటుడు సూరి, నివిన్ పౌలీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఐయామ్ గేమ్ సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు నివిన్ పౌలీ, మమితా బైజు నటించిన మలయాళ హిట్ చిత్రం ‘బెత్లహం ఫ్యామిలీ యూనిట్’ కూడా అదే రోజున తెలుగులో విడుదల కానుంది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సెప్టెంబర్ 10న కార్తీ, సూరి సినిమాలు
సెప్టెంబర్ రెండో వారంలో డబ్బింగ్ సినిమాల పోటీ మరింత పెరగనుంది. కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అదే రోజున నటుడు సూరి హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘మండాడి’ కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు సుహాస్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
సెప్టెంబర్‌లో ఎవరిది పైచేయి?
మొత్తంగా సెప్టెంబర్‌లో ఒక్కటి కాదు.. పలు తెలుగు, డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఆగస్టులో వచ్చిన ఊపును సెప్టెంబర్‌లోనూ కొనసాగించాలని టాలీవుడ్ ఆశిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల మధ్య కూడా గట్టి పోటీ ఉండటంతో.. ఈ నెలలో ఏ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంటుందో ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!