8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- POCO F9 Ultra, POCO F9 Pro స్మార్ట్ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్..
- 6.9 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్..
- Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, VisionBoost D8 డిస్ప్లే కో-ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO F9 Ultra: పోకో (POCO) నుండి F9 సిరీస్‌లో భాగంగా పోకో ఎఫ్9 అల్ట్రా (POCO F9 Ultra), పోకో ఎఫ్9 ప్రో (POCO F9 Pro) స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. అత్యాధునిక ప్రాసెసర్, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, 200MP కెమెరా, బోస్ ట్యూనింగ్ ఆడియో వంటి ఫీచర్లతో ఈ రెండు ఫోన్లు వినియోగదారుల ముందు వచ్చింది.
185Hz AMOLED డిస్ప్లే:
అల్ట్రా వేరియంట్ లో 6.9 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 185Hz రిఫ్రెష్ రేట్, 4,800Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. మరోవైపు ‘ప్రో’ మొబైల్ లో 6.59 అంగుళాల 1.5K 12-bit AMOLED డిస్ప్లే ఉంది. దీనిలోనూ 185Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, Xiaomi Vision Care, TÜV Rheinland క్వాడ్రపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్ అందించారు.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
పవర్ఫుల్ ప్రాసెసర్:
పోకో F9 అల్ట్రాలో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పాటు VisionBoost D8 డిస్ప్లే కో-ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్‌లో 4,165,108 స్కోర్ సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. గరిష్ఠంగా 16GB RAM, 1TB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. డ్యూయల్-చిప్ ఆర్కిటెక్చర్ కారణంగా కొన్ని గేమ్స్‌లో 185 FPS వరకు ఫ్రేమ్రేట్ను అందించగలదు. వైల్డ్ బూస్ట్ ఇంజిన్, AI సూపర్ రెజల్యూషన్, గేమ్ కలర్ ఎన్హాన్సమెంట్ వంటి ఫీచర్లు గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే 4,800Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్, 480Hz మల్టీ-టచ్ శాంప్లింగ్, 200Hz గైరోస్కోప్ శాంప్లింగ్కు సపోర్ట్ ఉంది.
బోస్ ట్యూనింగ్:
ఆడియో విషయంలో POCO F9 అల్ట్రా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఫోన్లో 2.1 ఛానల్ స్పీకర్ సెటప్ ఉంది. రెండు 1115D స్టీరియో స్పీకర్లతో పాటు ప్రత్యేకంగా 1620 సబ్‌వూఫర్‌ను అందించారు. బోస్‌తో కలిసి ఆడియో ట్యూనింగ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ‘ప్రో’ లో డ్యూయల్ 1115F సూపర్లీనియర్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ డైనమిక్, బ్యాలెన్స్డ్ ఆడియో ప్రొఫైల్స్‌తో పాటు గేమింగ్ సమయంలో తక్కువ లేటెన్సీ కోసం ప్రత్యేక ఆడియో మోడ్ ఉంది.
భారీ బ్యాటరీ:
పోకో F9 అల్ట్రాలో 8,050mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను అందించారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 22.5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. అలాగే F9 ప్రోలో 6,330mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ కూడా 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
200MP కెమెరా..
కెమెరా విభాగంలో పోకో తొలిసారిగా 200MP OIS ప్రైమరీ కెమెరాను ఈ సిరీస్‌లో తీసుకొచ్చింది. పోకో F9 అల్ట్రాలో 1/1.56 అంగుళాల S5KHP5 సెన్సార్, f/1.68 అపెర్చర్‌తో కూడిన 200MP కెమెరా ఉంది. దీనికి తోడు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 5x ఆప్టికల్ జూమ్‌తో పాటు 30cm వరకు టెలీమ్యాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ ఉంటుంది. OIS, EIS, 8K వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక F9 ప్రోలోనూ 200MP మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 2.5x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో 10cm వరకు టెలీమ్యాక్రో ఫోటోగ్రఫీ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు మోడళ్లలోనూ 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ధర:
గ్లోబల్ మార్కెట్లో పోకో F9 ప్రో 12GB + 256GB వేరియంట్ ధర 699 డాలర్లు, 12GB + 512GB వేరియంట్ ధర 769 డాలర్లుగా నిర్ణయించారు. పోకో F9 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ ధర 799 డాలర్లు, 16GB + 512GB వేరియంట్ ధర 949 డాలర్లు, టాప్-ఎండ్ 16GB + 1TB వేరియంట్ ధర 1,199 డాలర్లుగా ఉంది. ప్రారంభ అమ్మకాలలో భాగంగా 50 డాలర్ల ఎర్లీ బర్డ్ డిస్కౌంట్‌తో పోకో F9 ప్రో ధర 649 డాలర్లకు తగ్గనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు