Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం సాధ్యమే. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల జీవితంలో నుంచి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు అంటున్న ఎగ్జిట్ పోల్స్
మీకోసం మీరు సమయం కేటాయించుకోవాలి..
* జీవితం నుంచి ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మొదట మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* స్వీయ-ఆలోచన: ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో మీరు అత్యంత సంతృప్తిగా, సంతోషంగా ఉన్న క్షణాల గురించి ఆలోచించాలి.
* జర్నలింగ్: మీరు ఏమి నమ్ముతారో, ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తుందో, మీకు నిజమైన ఆనందాన్ని కలిగించేది ఏమిటో ఒక పేపర్ మీద రాసుకోవాలి.
* మాట్లాడండి: మీ ఆలోచన సరళి దగ్గరగా ఉన్న వారితో మీ భావాలను పంచుకోండి. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్న అంశాల గురించి వారితో చర్చించి, వారి నుంచి ఏమైనా సలహాలు తీసుకోండి.
* ప్రతికూల వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం ఆరోగ్యకరంగా ఉంటుంది.
* మైండ్‌ఫుల్‌నెస్ కోసం ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకోండి. ప్రస్తుత క్షణంలో ఉండటం నేర్చుకోండి, ఇది ప్రతికూల స్వీయ-చర్చను తగ్గిస్తుంది, అలాగే మీ మనస్సును క్లియర్ చేస్తుంది.
* మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, పరిపూర్ణత అనేది ఒక పురాణం. మీ తప్పుల నుంచి మీరు కొత్త విషయాలను నేర్చుకోండి, చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా, మళ్లీ ఆ తప్పులను చేయకుండా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఆలోచించండి.
* జీవితం ఎప్పుడూ ప్రణాళిక ప్రకారం సాగదు. అందుకని మీ లక్ష్యాలను సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
READ ALSO: Exit poll History: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటో తెలుసా? దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే!