Home Tips: ఈ భూమి మీద ఉన్న చాలా మందికి కొన్ని రకాల జీవరాశులను చూస్తే భయం వేస్తుంది. అందులో బొద్దింకలు కూడా ఒకటి. నిజానికి మరికొందరు వాటితో ఆడుకుంటారు కూడా. అసలు బొద్దింకలు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా.. చాలా అపరిశుభ్రమైన ప్రాంతాలలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి అక్కడే జీవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మురికి ప్రదేశాలు, చెత్తాచెదారం, టాయిలెట్లు మొదలైన వాటిలో బొద్దింకలు కనిపిస్తాయని చెప్పారు. ఇకపై ఈ బొద్దింకల బెడదను మీ ఇంట్లో తగ్గించడానికి ఈ చిట్కాలను ట్రై చేయండి.
READ ALSO: Yash KGF Chapter 3 Update: KGF 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పిన రాకీ భాయ్..
* ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. మీరు ఇంట్లో ఉపయోగించే చెత్త డబ్బాలకు మూతలు ఉండేలా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఆ చెత్త డబ్బాలను రాత్రిపూట సమయంలో ఇంటి బయట పెట్టాలి.
* తిన్న వెంటనే ప్లేట్లను కడగాలి. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే బయట పడేయాలి.
* బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ఇంట్లోకి రావచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.
* బొద్దింకలు చాలా వరకు డిష్ వాషర్ల నుంచే ఇళ్లలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు. కాబట్టి రాత్రి పూట దానిపై ఏదైనా కప్పి ఉంచితే మంచిది.
* బొద్దింకలను ఇంటి లోపల నుంచి పంపేందుకు స్ప్రేలు, జెల్‌లను ఉపయోగిస్తారు. అయితే ఇవి మనుషులకు కూడా హానికరమే.
* అట్ట పెట్టెలపై శ్రద్ధ పెట్టాలి. ఆ పెట్టెలను చెక్క గుజ్జుతో తయారు చేస్తారు. నిజానికి ఇవి బొద్దింకలకు చాలా ఇష్టమైన ఆహారం.
READ ALSO: Purushaha Teaser: నవ్వకుండా ఉండలేరంతే.. పురుషః టీజర్ చూసేయండి..!