Home Cleaning Tips: ఎంత బిజీగా ఉన్న ఇంటిని మాత్రం కచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటాం. అలా క్లీన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను శుభ్రం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయిని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల వస్తువులను నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా క్లీన్ చేయాలని వాళ్లు చెబుతున్నారు. ఇంతకీ అవి ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే తెలుసుకోండి ఈ స్టోరీలో..
READ ALSO: Anti-Immigration Rally: ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా నిరసన..
ఈ బిజీ లైఫ్‌లో చాలామందికి ఇంటిని శుభ్రం చేసుకోడానికి సరైన సమయం దొరకడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది దొరికిన కొద్ది సమయంలో ఏదో క్లీన్ చేశామంటే చేశామని కాకుండా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కిటికీలను ఏ పండగలో, ప్రత్యేక సందర్భాల్లోనో తప్ప మిగతా రోజుల్లో క్లీన్ చేయాలనే ఆలోచనే చాలా మందికి రావడం లేదు. అయితే కిటికీలను వారం నుంచి నెల రోజుల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా క్లీన్ చేయడం మంచిదని సూచించారు. బాత్‌టబ్, షవర్‌ను ప్రతి రెండు లేదా మూడు వారాలకోసారి క్లీన్ చేయాలని, అలాగే టాయిలెట్, సింక్‌లను మాత్రం వారానికోసారి కచ్చితంగా శుభ్రంగా కడగాల్సిందేనాని చెప్పారు. చాలా మంది బెడ్షీట్లు, పిల్లో కవర్లు వంటి వాటిని తరచూ శుభ్రం చేస్తున్నప్పటికీ పరుపుని క్లీన్ చేయాలనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉండన్నారు. కాబట్టి రెండు నెలలకు ఒక్కసారైనా పరుపును శుభ్రం చేయడం మంచిదని వివరించారు. ఈ నేపథ్యంలో పరుపుపై బేకింగ్ సోడాను చల్లి కాసేపు అలాగే ఉంచాలని, ఆ తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేస్తే సరిపోతుందని తెలిపారు.
ల్యాప్‌టాప్, కంప్యూటర్ కీబోర్డ్‌పై టాయిలెట్ సీట్లో ఉండే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది వీటికి దుమ్ము పట్టిందని అనిపించినప్పుడు మాత్రమే శుభ్రం చేస్తుంటారని, ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి వారానికోసారి డిస్- ఇన్ఫెక్టెంట్ స్ప్రేతో కీబోర్డు శుభ్రం చేయాలని, అలాగే మౌస్‌ని కూడా క్లీన్ చేయాలని తెలిపారు. సాధారణంగా బాత్ టవల్స్‌ను మహా అయితే వారానికోసారి ఉతుకుతుంటాం. కానీ ఇలా చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పవంటున్నారు. ఎందుకంటే మన చర్మంపైన ఉన్న మృతకణాలు టవల్‌పై చేరతాయని, ఫలితంగా అది చర్మానికి హానికరంగా తయారవడంతో పాటు దుర్వాసన కూడా వస్తుందని వివరించారు. అందుకే వాటిని మూడుసార్లు ఉపయోగించిన వెంటనే ఉతికేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మాములుగా కార్పెట్‌ను అప్పుడప్పుడూ దులిపి ఎండలో వేసి మళ్లీ ఇంట్లో పరుస్తుంటారు. అయితే ఇలా చేయడంతో పాటు కనీసం నెలకు ఒక్కసారైనా వాటిని ప్రత్యేకంగా క్లీన్ చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే, కార్పెట్‌కు దుమ్ము అతుక్కొని ఉండిపోతుందని, దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంట్లో చిన్నారులు ఉన్నట్లయితే కార్పెట్ శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకోసారి వీటిని స్టీమింగ్ చేస్తే మంచిదని చెబుతున్నారు.