Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Hiccups Home Remedies Stop Hiccups Fast Natural Tips

Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

Published Date :March 27, 2026 , 9:48 pm
By Gogikar Sai Krishna
  • వెక్కిళ్లు ఎందుకు వస్తాయి? సాధారణ కారణాలు
  • 30 సెకన్లలో ఉపశమనం ఇచ్చే సింపుల్ టిప్స్
  • వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్‌తో వెక్కిళ్లకు చెక్
  • ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.?
Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hiccups Remedies in Telugu:  అకస్మాత్తుగా వచ్చే వెక్కిళ్లు ఒక్కోసారి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడు వెక్కిళ్లు వస్తే కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. సాధారణంగా వెక్కిళ్లు కొద్దిసేపటికే తగ్గిపోతాయి, కానీ కొన్నిసార్లు ఎంతకీ తగ్గకుండా విసిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఉపశమనం పొందేందుకు నిపుణులు ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు.

వెక్కిళ్లను ఆపే 5 మ్యాజికల్ టిప్స్..

1. చల్లటి నీటిని సిప్ చేయడం (Ice Cold Water Sips):
చాలామంది వెక్కిళ్లు రాగానే గటగటా నీళ్లు తాగేస్తారు. కానీ డాక్టర్ భగత్ సింగ్ ప్రకారం, అలా చేయడం కంటే ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుని టీ తాగినట్లుగా చిన్న చిన్న సిప్స్ చేయాలి. ఇలా సుమారు 8 నుంచి 10 సార్లు మెల్లిగా నీటిని మింగడం వల్ల వెక్కిళ్లు తక్షణమే ఆగిపోతాయి.

2. పేపర్ బ్యాగ్‌తో శ్వాస ప్రక్రియ (Paper Bag Technique):
ఒక చిన్న ఖాళీ పేపర్ కవర్‌ను తీసుకుని దానిని ముక్కు, నోటికి అడ్డంగా ఉంచుకోవాలి. ఆ కవర్‌లోకి నెమ్మదిగా గాలిని వదులుతూ, మళ్ళీ అదే గాలిని పీల్చుకోవాలి. ఇలా 5 నుండి 6 సార్లు చేయడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలో మార్పు వచ్చి వెక్కిళ్లు నిలిచిపోతాయి.

3. నిమ్మకాయ ముక్కను చప్పరించడం (Sucking Lemon):
వెక్కిళ్లు ఆగనప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని చప్పరించాలి. పుల్లటి పదార్థం నోటిలోకి వెళ్లినప్పుడు శరీరంలోని ‘వేగస్ నర్వ్’ స్టిమ్యూలేట్ అవుతుంది. దీనివల్ల వెక్కిళ్లు రావడం తక్షణమే ఆగుతుంది.

4. ఊపిరి బిగబట్టడం (Hold Your Breath):
శరీరంలోని వేగస్ నర్వ్‌ను శాంతింపజేయడానికి ఇది మంచి మార్గం. గాలిని బాగా లోపలికి పీల్చుకుని, కనీసం 10 నుండి 15 సెకన్ల పాటు అలాగే బిగబట్టి ఉంచాలి. ఈ చిన్న టెక్నిక్ వెక్కిళ్లను దూరం చేస్తుంది.

5. నిటారుగా కూర్చుని మింగడం (Sitting Upright):
ఆహార వాహికపై ఒత్తిడి వల్ల కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. అలాంటప్పుడు నిటారుగా కూర్చొని, తలను కొద్దిగా ముందుకు వంచి, గొంతులో ఏదైనా మింగుతున్నట్లుగా కదలికలు చేయాలి. దీనివల్ల ఆహార వాహిక రిలాక్స్ అయ్యి వెక్కిళ్లు తగ్గిపోతాయి.

ముఖ్య గమనిక: ఇవి కేవలం వెక్కిళ్లను తగ్గించే సాధారణ ఇంటి చిట్కాలు మాత్రమే. ఒకవేళ వెక్కిళ్లు గంటల తరబడి తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health Tips
  • Hiccups Remedies
  • Home Remedies
  • Natural Cure
  • Quick Relief

తాజావార్తలు

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • PM Modi: సీఎంలతో ముగిసిన మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!

  • PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి

  • Drone Smuggling: పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం.. రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ, 1.5 కిలోల హెరాయిన్ సీజ్!

  • Latest Weather Update : ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. రేపు ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం..}

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions