Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!
- వెక్కిళ్లు ఎందుకు వస్తాయి? సాధారణ కారణాలు
- 30 సెకన్లలో ఉపశమనం ఇచ్చే సింపుల్ టిప్స్
- వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్‌తో వెక్కిళ్లకు చెక్
- ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hiccups Remedies in Telugu: అకస్మాత్తుగా వచ్చే వెక్కిళ్లు ఒక్కోసారి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడు వెక్కిళ్లు వస్తే కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. సాధారణంగా వెక్కిళ్లు కొద్దిసేపటికే తగ్గిపోతాయి, కానీ కొన్నిసార్లు ఎంతకీ తగ్గకుండా విసిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఉపశమనం పొందేందుకు నిపుణులు ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను పంచుకున్నారు.
వెక్కిళ్లను ఆపే 5 మ్యాజికల్ టిప్స్..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
1. చల్లటి నీటిని సిప్ చేయడం (Ice Cold Water Sips):
చాలామంది వెక్కిళ్లు రాగానే గటగటా నీళ్లు తాగేస్తారు. కానీ డాక్టర్ భగత్ సింగ్ ప్రకారం, అలా చేయడం కంటే ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుని టీ తాగినట్లుగా చిన్న చిన్న సిప్స్ చేయాలి. ఇలా సుమారు 8 నుంచి 10 సార్లు మెల్లిగా నీటిని మింగడం వల్ల వెక్కిళ్లు తక్షణమే ఆగిపోతాయి.
2. పేపర్ బ్యాగ్‌తో శ్వాస ప్రక్రియ (Paper Bag Technique):
ఒక చిన్న ఖాళీ పేపర్ కవర్‌ను తీసుకుని దానిని ముక్కు, నోటికి అడ్డంగా ఉంచుకోవాలి. ఆ కవర్‌లోకి నెమ్మదిగా గాలిని వదులుతూ, మళ్ళీ అదే గాలిని పీల్చుకోవాలి. ఇలా 5 నుండి 6 సార్లు చేయడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలో మార్పు వచ్చి వెక్కిళ్లు నిలిచిపోతాయి.
3. నిమ్మకాయ ముక్కను చప్పరించడం (Sucking Lemon):
వెక్కిళ్లు ఆగనప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని చప్పరించాలి. పుల్లటి పదార్థం నోటిలోకి వెళ్లినప్పుడు శరీరంలోని ‘వేగస్ నర్వ్’ స్టిమ్యూలేట్ అవుతుంది. దీనివల్ల వెక్కిళ్లు రావడం తక్షణమే ఆగుతుంది.
4. ఊపిరి బిగబట్టడం (Hold Your Breath):
శరీరంలోని వేగస్ నర్వ్‌ను శాంతింపజేయడానికి ఇది మంచి మార్గం. గాలిని బాగా లోపలికి పీల్చుకుని, కనీసం 10 నుండి 15 సెకన్ల పాటు అలాగే బిగబట్టి ఉంచాలి. ఈ చిన్న టెక్నిక్ వెక్కిళ్లను దూరం చేస్తుంది.
5. నిటారుగా కూర్చుని మింగడం (Sitting Upright):
ఆహార వాహికపై ఒత్తిడి వల్ల కూడా వెక్కిళ్లు వస్తుంటాయి. అలాంటప్పుడు నిటారుగా కూర్చొని, తలను కొద్దిగా ముందుకు వంచి, గొంతులో ఏదైనా మింగుతున్నట్లుగా కదలికలు చేయాలి. దీనివల్ల ఆహార వాహిక రిలాక్స్ అయ్యి వెక్కిళ్లు తగ్గిపోతాయి.
ముఖ్య గమనిక: ఇవి కేవలం వెక్కిళ్లను తగ్గించే సాధారణ ఇంటి చిట్కాలు మాత్రమే. ఒకవేళ వెక్కిళ్లు గంటల తరబడి తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!