Drone Smuggling: పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం.. రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ, 1.5 కిలోల హెరాయిన్ సీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Smuggling: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ స్మగ్లర్ల కుట్రలను సరిహద్దు భద్రతా దళం (BSF), పంజాబ్ పోలీసులు మరోసారి భగ్నం చేశారు. గురువారం రాత్రి అటారీ సరిహద్దు పరిసరాల్లో నిర్వహించిన మెరుపు సోదాల్లో భారీ ఎత్తున నకిలీ కరెన్సీతో పాటు మాదక ద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీ స్మగ్లర్లు డ్రోన్ల సహాయంతో భారత భూభాగంలోకి నిషేధిత వస్తువులను జారవిడిచినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్ సైనికులు, పంజాబ్ పోలీసు బృందాలు సరిహద్దు వెంట గాలింపు చేపట్టాయి. ఖన్‌గఢ్‌లోని బోర్డర్ అవుట్‌పోస్ట్ (BOP) వద్ద గాలిస్తుండగా, స్మగ్లర్లు జారవిడిచిన ఒక ప్యాకేజీ భద్రతా దళాలకు చిక్కింది.
READ ALSO: Latest Weather Update : ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. రేపు ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం..}
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ఏమేం దొరికాయంటే..
స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లను తనిఖీ చేయగా, అందులో రూ. 2.5 లక్షల విలువైన నకిలీ భారతీయ కరెన్సీ బయటపడింది. మరో ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో సుమారు 1.5 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. ఈ ఘటనపై లోపోకే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఈ సరుకును సరిహద్దు అవతలి నుంచి ఎవరు పంపారు? ఇక్కడ ఎవరికి అందజేయాల్సి ఉంది? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సరిహద్దుల్లో డ్రోన్ల సంచారంపై బీఎస్‌ఎఫ్ నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!