Latest Weather Update : ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. రేపు ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం..}
- ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
- 16 మండలాల్లో ఎక్స్‌ట్రీమ్ హీట్ అలర్ట్
- 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఎండదెబ్బ నుంచి రక్షణకు కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు అప్పుడే నిప్పులు చెరుగుతున్నాయి. మార్చి నెల ముగియకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేపు (శనివారం, మార్చి 28) ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రాజాం, తెర్లాం వంటి పలు మండలాలు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, సాలూరు వంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
LPG: ఇక కమర్షియల్ ఎల్పీజీ కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. గుంటూరులో 16, పల్నాడులో 21, ఎన్టీఆర్ జిల్లాలో 9 మండలాలతో పాటు కృష్ణా, ఏలూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటికి ఈ తీవ్రత మరింత పెరిగి, దాదాపు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!
శుక్రవారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో గరిష్టంగా 42.1°C, కడప జిల్లా కమలాపురంలో 42°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పల్నాడు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా పారలు 41 డిగ్రీలను దాటేశాయి. తీర ప్రాంత జిల్లాలైన కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరిలో కూడా 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గమనార్హం. ఈ అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల జనజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ఎండదెబ్బ నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా తలకి టవల్ చుట్టుకోవాలని, శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాటన్ దుస్తులు ధరించాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఎండ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని హితవు పలికారు. తగినంత నీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!