Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!
- మెంతులలో దాగి ఉన్న పోషక శక్తి
- జీర్ణక్రియ నుంచి మధుమేహం వరకు లాభాలే
- ఉదయాన్నే మెంతి నీళ్లు తాగితే ఏమవుతుంది?
- ఎంత మోతాదులో తీసుకోవాలి? జాగ్రత్తలు ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Tips in Telugu :మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు చాలా ముఖ్యమైనవి. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మెంతులను ఒక ఔషధంగా పరిగణించవచ్చని డాక్టర్ ఆర్ఆర్ జైన్ పేర్కొన్నారు. వీటిలో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
మెంతులలోని పోషక విలువలు:
మెంతులలో ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి6, ప్రొటీన్లు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పోషక లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Also Read
- Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణ సమస్యల నివారణ: గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మధుమేహం నియంత్రణ: రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి మెంతులు సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఇవి తోడ్పడతాయి.
మహిళల ఆరోగ్యానికి: పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి (Dysmenorrhea) తగ్గించడానికి , హార్మోన్ల సమతుల్యతకు మెంతులు మేలు చేస్తాయి.
బరువు తగ్గడం: మెంతులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి, తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
జుట్టు , చర్మ సౌందర్యం: జుట్టు రాలడం తగ్గించడానికి, చర్మంపై ముడతలు నివారించడానికి మెంతులు సహకరిస్తాయి.
ఎలా తీసుకోవాలి? : మెంతులను నేరుగా తినడం కంటే, వాటిని సరైన పద్ధతిలో తీసుకుంటే పూర్తి ఫలితాలు అందుతాయని నిపుణులు వివరించారు.
నానబెట్టిన మెంతులు: ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి, నానిన మెంతులను నమిలి తినాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి (Detox), మెటబాలిజంను పెంచుతుంది.
మెంతులు + ఇతర పదార్థాలు: మెంతులను పెరుగుతో కలిపి తీసుకోవడం లేదా కూరల్లో పొడి రూపంలో వాడటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
మెంతులు శరీరంలో వేడిని కలిగిస్తాయి కాబట్టి, అతిగా తీసుకోకూడదని నిపుణులు సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా గర్భిణీలు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని వాడటం ఉత్తమం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!