రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగి అట్లు..
ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగా కూడా ఉంటుంది.. ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగిపిండి : 500 గ్రాములు
బెల్లం : 25 గ్రాములు
నీళ్ళు : తగినంత
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
ముందుగా బెల్లం ను నీటిలో కరిగించాలి..ఈ నీటిలో రాగి పిండి కలిపి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం పలుచగా ఉండేటట్లు సరిచూసుకోవాలి. పొయ్యిమీద పెట్టిన పెనంపై గరిటతో కలిపి ఉంచిన పిండిని దోసలా వేయ్యాలి. అట్టును రెండువైపులా కాల్చాలి..అంతే రాగి అట్టు రెడీ.. ఎంతో సింపుల్ గా అయ్యింది కదా.. మీరు కూడా ట్రై చెయ్యండి.. తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు..
రాగి పూరి..
రాగి పూరి మామూలు పూరిలాగే ఉంటుంది.. అంతేకాదు ఆరోగ్యానికి మంచిది కూడా.. ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 100 గ్రాములు
మైదా : 25 గ్రాములు
నూనె : 120 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
ఒక గిన్నె తీసుకోని మైదా, రాగి పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్ళుపోసి పూరి పిండిలాగా కలుపుకుని, 20 నిమిషాలు ప్రక్కన ఉంచాలి. ఉండల్లా చుట్టుకొని పూరీల్లా చేసుకోవాలి. ఈ పూరీలను బాగా మరిగిన నూనెలో వేయించుకోవాలి.. కాంబినేషన్ గా పుదీనా చట్నీని తీసుకోవడం వల్ల టెస్ట్ మరింత పెరుగుతుంది..
రాగి ఇడ్లీ..
రాగిపిండి తో ఇడ్లీ కూడా చాలా మంచిదే.. ఆవిరి మీద ఉడుకుతుంది కదా పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఎలా తయారు చెయ్యాలంటే..
కావలసిన పదార్థాలు :
రాగి పిండి : 60 గ్రాములు
మినపపిండి : 20 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
మినప పప్పుని నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్ళలో నీటిని కలిపి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక రాత్రి వరకు నాననివ్వాలి. తరువాత రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలవలె పోసి 15 నిమిషాలు పాటు ఉడక నివ్వాలి. వేరుశనగ, అల్లం చెట్నీలతో తింటే బాగుటుంది.. మీ ఇష్టం మీ చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది.. ట్రై చెయ్యండి..
ఇవే కాదు రాగి సంగటి, రాగి జావా, రాగి చపాతీ లను కూడా తయారు చేసుకోవచ్చు,..