NTV Telugu Site icon

Heart Disease: రోజుకు 6 వేల-9 వేల అడుగులు నడవండి.. గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోండి..

Heart Attack

Heart Attack

Walking 6,000-9,000 steps a day lowers risk of heart disease: ప్రస్తుతం గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా గుండె జబ్బులు ఉండేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. జీవనతీరు మారడం, పని ఒత్తడి, ఆహారపు అలవాల్లు, వ్యాయామం లేకపోవడం ఇలా అన్ని కలిసి గుండె వ్యాధులకు కారణం అవుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా మధ్యవయస్కులు, వృద్ధుల్లో నడకకు, గుండె జబ్బులకు సంబంధాన్ని కనుక్కుంది.

Read Also: Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు

రోజుకు 6000-9000 అడుగులు, సుమారుగా 6 కిలోమీటర్లు నడిచే మధ్యవయస్కుల్లో గుండె పోటు వచ్చే అవకాశం 40 నుంచి 50 శాతానికి తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. సర్క్యులేషన్ జర్నల్‌లో ఈ విషయాన్ని ప్రచురించారు. 60 ఏళ్లకు పైబడిన వారు మరికొన్ని మరికొంత సమయంలో నడవాల్సి ఉంటుందని అధ్యయనంలో తేలింది. 18, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న 20,152 మంది వ్యక్తులపై ఎనిమిది అధ్యయనాలు డేటా ఆధారంగా ఈ పరిశోధన చేశారు. దాదాపుగా ఆరేళ్లు వారి ఆరోగ్యంపై నిఘా పెట్టారు.

ఈ స్టడీలో నడక వల్ల ఆరోగ్యం మెరుగుపడినట్లు తేలింది. 2020లో, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అయితే, ప్రతిరోజూ 10,000 అడుగులు లేదా ప్రతిరోజూ 8 కిలోమీటర్లు నడవాలని సిఫార్సు చేసింది. నడక వల్ల బీపీ, షుగర్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.