Ragi Cake: ఆరోగ్యానికి ఆరోగ్యం… రుచికి రుచి… ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ‘షుగర్ ఫ్రీ రాగి కేక్’ చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Cake: ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కేకులు అంటే ఇష్టపడని వారుండరు. అయితే మైదా పిండి, చక్కెరతో చేసే కేకులు ఆరోగ్యానికి అంత మంచివి కావని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే మీలాంటి హెల్త్ కాన్షియస్ క్రేవింగ్స్ కోసమే ఈ సూపర్ రెసిపీ. సాధారణంగా కేక్ అనగానే మైదా, పంచదార, గుడ్లు గుర్తొస్తాయి. కానీ, వాటన్నింటికీ గుడ్ బై చెప్పేసి… కేవలం రాగి పిండి, ఖర్జూరం, అరటిపండ్ల కాంబినేషన్‌తో నోరూరించే చాక్లెట్ వాల్నట్ కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ ఇచ్చే ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ ‘గిల్ట్-ఫ్రీ’ రాగి కేక్‌ను కేవలం కొన్ని నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
గింజలు తీసేసిన ఖర్జూరాలు – 1 కప్పు
Also Read
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
పాలు – 1/2 కప్పు
నూనె – 1/3 కప్పు
బాగా పండిన అరటిపండ్లు – 2
వెనీలా ఎసెన్స్ – 1 చెంచా
రాగి పిండి – 1 కప్పు
బేకింగ్ పౌడర్ – 1 చెంచా
బేకింగ్ సోడా – 1/2 చెంచా
ఉప్పు – చిటికెడు
ఓట్స్ పిండి (Oats flour) – 1/2 కప్పు
కోకో పౌడర్ – 1/4 కప్పు
వాల్నట్స్ (Walnuts) – 1/3 కప్పు
చాకో చిప్స్ (Choco chips) – తగినంత
తయారీ విధానం ఇదే..
ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఖర్జూరాలు, అర కప్పు పాలు, 1/3 కప్పు నూనె వేసి మెత్తని పేస్ట్‌లా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రెండు పండిన అరటిపండ్లను వేసి స్పూన్‌తో మెత్తగా స్మాష్ చేయాలి. అందులో ముందుగా రెడీ చేసుకున్న ఖర్జూరం పేస్ట్, ఒక చెంచా వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంపై జల్లెడ (Sifter) ఉంచి… రాగి పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. తర్వాత అర కప్పు ఓట్స్ పిండి, 1/4 కప్పు కోకో పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ కేక్ మిశ్రమంలో వాల్నట్స్ ముక్కలు, చాకో చిప్స్ వేసి మెల్లగా కలుపుకోవాలి.
కేక్ టిన్‌కు కొద్దిగా నూనె రాసి, అందులోకి ఈ మిశ్రమాన్ని మార్చుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా గిన్నెను ఒకసారి టాప్ చేయాలి. పైన మరికొన్ని వాల్నట్స్, చాకో చిప్స్ చల్లుకోవాలి. దీనిని 160 డిగ్రీల సెల్సియస్ (160°C) ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఓవెన్ నుంచి తీసిన తర్వాత టూత్‌పిక్ గుచ్చి చూస్తే, అది క్లీన్‌గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇక కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మైదా, పంచదార లేని ఈ పోషకాల గని అయిన రాగి కేక్ పిల్లల స్నాక్స్ బాక్స్‌కు, హెల్తీ డైట్ ఫాలో అయ్యేవారికి ఒక అద్భుతమైన ఛాయిస్.
ఆరోగ్య ప్రయోజనాలు..
తృణధాన్యాలన్నింటిలోకెల్లా రాగిలో క్యాల్షియం శాతం చాలా ఎక్కువ. ఇది ఎముకలను, పళ్ళను దృఢంగా ఉంచుతుంది. పెరుగుతున్న పిల్లలకు, మహిళలకు ఇది ఎంతో అవసరం. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా నియంత్రిస్తాయి. ఖర్జూరాల్లో ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, ఎనీమియా (రక్తహీనత) రాకుండా కాపాడుతుంది. ఈ కెక్లో తెల్ల చక్కెరలా కాకుండా, ఖర్జూరంలోని నాచురల్ తీపి వల్ల శరీరానికి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. అలాగే అరటిపండ్లలో ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్లో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ (పీచు పదార్థం) జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఓట్స్‌లో ఉండే ‘బీటా-గ్లూకాన్’ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ కేక్ పూర్తిగా మైదా – షుగర్ ఫ్రీ కావడం వల్ల డయాబెటిస్ ఉన్నవారు (పరిమితంగా), వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, జిమ్కెళ్లేవారు ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తినేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రాగి షుగర్ ఫ్రీ కెక్ను కుదిరితే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి.
తాజావార్తలు
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!