ప్రస్తుత కాలంలో ఏ ఫుడ్ తినాలన్న బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ హోటల్లో తినాలన్నా అందులో ఏం కలుస్తుందోన్న ఆందోళన, భయం ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే జంక్ ఫుడ్ కాకుండా.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే…రోగాలు రావో.. వాటిని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలని నిఫుణులు చెబుతున్నారు. చలికాలంలో పల్లీలు తినడం చాలా మంచిదంటున్నారు. Read Also:Realme GT8 Pro: మార్కెట్ లోకి రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్..…
రోజూ గుప్పెడు వేరుశెనగలు లేదా పది గ్రాముల నట్స్ తినండి ఆరోగ్యంగా జీవించండి అంటున్నారు నెదర్లాండ్స్కు చెందిన మాస్ట్రిట్చ్ యూనివర్శిటీ పరిశోధకులు. వారి పరిశోధనల ప్రకారం రోజూ వేరుశెనగలు, నట్స్, డ్రైఫ్రూట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుందని తెలిసిందట. శరీరానికి కావల్సిన పోషకాలను అందించి అనారోగ్యాలను నివారించే నట్స్, వేరుశెనగలు రోజూ తీసుకోవడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్లు ముప్పై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షా ఇరవైవేల మంది జీవనవిధానాన్ని పరిశీలించారట. ముఖ్యంగా…