Top Peanuts Health Benefits: పప్పు ధాన్యాలకి చెందిన ‘వేరుశెనగ’ (పల్లీలు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. చలికాలంలో వేడి వేడి వేరుశెనగలు తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. చట్నీ చేసుకుని తిననిదే కొంత మందికి అల్ఫాహారం పూర్తికాదు. చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు.. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన…
రోజూ గుప్పెడు వేరుశెనగలు లేదా పది గ్రాముల నట్స్ తినండి ఆరోగ్యంగా జీవించండి అంటున్నారు నెదర్లాండ్స్కు చెందిన మాస్ట్రిట్చ్ యూనివర్శిటీ పరిశోధకులు. వారి పరిశోధనల ప్రకారం రోజూ వేరుశెనగలు, నట్స్, డ్రైఫ్రూట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుందని తెలిసిందట. శరీరానికి కావల్సిన పోషకాలను అందించి అనారోగ్యాలను నివారించే నట్స్, వేరుశెనగలు రోజూ తీసుకోవడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్లు ముప్పై సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షా ఇరవైవేల మంది జీవనవిధానాన్ని పరిశీలించారట. ముఖ్యంగా…