Health: చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..?
- చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడం కష్టం
- కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం
- చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం
- ఎక్కువగా చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. అయినప్పటికీ.. ఇప్పటికీ చాలా మందికి సరిగ్గా స్నానం ఎలా చేయడం తెలియదు. ఈ క్రమంలో స్నానం ఎలా చేయాలో ఆయుర్వేద నిపుణులు కొన్ని పద్ధతుల గురించి చెప్పారు. అవేంటో తెలుసుకుందాం…..
Read Also: Goa: టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!
Also Read
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
సరిగ్గా స్నానం చేయడం ఎలా..?
పురాతన కాలంలో చెరువు లేదా నదిలో స్నానం చేసే సంప్రదాయం ఉండేది. అందులో ప్రజలు నేరుగా స్నానం చేసేవారు. చెరువులో లేదా నదిలో స్నానం చేస్తే వెంటనే తల తడిసిపోతుంది. దీంతో.. శరీర ఉష్ణోగ్రత వెంటనే పడిపోతుంది. అయితే ఈ సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది. ఇంట్లోనే స్నానాలు చేస్తున్నారు. అయితే.. ఎప్పుడూ తల నుండి స్నానం చేయాలని.. ముందుగా తలపై నీరు పోసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.
ఇలా స్నానం చేయడం ప్రమాదకరం..
నిజానికి తలపై నీళ్లు పోసుకుంటే తక్షణమే తల చల్లబడుతుంది. స్నానం చేసేటప్పుడు తలపై నీరు పోయకుండా.. పాదాలకు లేదా శరీరానికి పోసుకునే వారు చాలా మంది ఉంటారు. అలా చేయడం ప్రమాదకరమని అంటున్నారు. తలపై కాకుండా శరీరంపై నీటిని పోయడం వల్ల.. తల వైపు వేడి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
శీతాకాలంలో స్నానం చేయడానికి ఏ నీరు అవసరం..?
చలికాలంలో స్నానం చేయడం చాలా కష్టం. ఈ సీజన్లో తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. గోరువెచ్చని నీరు మరీ వేడిగానూ, చల్లగానూ ఉండదు. దీనితో తలస్నానం చేయడం వల్ల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా శరీరానికి ఉపశమనం కలుగుతుంది.
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!