Hair Care Tips: శీతాకాలంలో జుట్టుకు ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు రాదు..
- చలికాలంలో జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
- చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగిస్తే..
- జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో చర్మాన్ని, శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అంతే జాగ్రత్తగా జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చల్లటి గాలి, తక్కువ తేమ, తరచుగా వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు సహజ తేమను, మెరుపును కోల్పోతుంది. ఈ క్రమంలో.. సరైన జుట్టు సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.
చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయద్దు:
వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టుకు హానికరం. వేడి నీరు జుట్టును దాని సహజ తేమను తొలగిస్తుంది. దీంతో.. జుట్టు పొడిగా, నిర్జీవంగా అనిపిస్తుంది. గోరువెచ్చని లేదా చల్లటి నీటితో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీంతో.. జుట్టు తేమగా ఉంటుంది.
Also Read
- Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ 'క్యాబేజీ ఎగ్ శాండ్విచ్'.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
- Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ 'ఎగ్ హాష్'!
- Protein Rich Sattu Drink : 'సత్తు డ్రింక్' శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోండి:
కాలుష్యం మీ జుట్టును త్వరగా దెబ్బతీస్తుంది. చల్లని గాలి, ధూళి నుండి రక్షించడానికి మీ జుట్టుకు స్కార్ఫ్ లేదా టోపీ పెట్టుకోవాలి. ఉన్ని లేదా కాటన్ దుస్తులు వాడొద్దు.. ఇవి పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది. జుట్టును రక్షించడానికి సిల్క్ లేదా శాటిన్ ఫాబ్రిక్ ఉపయోగించాలి.
మసాజ్ చేయాలి:
చలికాలంలో తలకు మసాజ్ చేయాలి. చల్లని గాలి జుట్టు నుండి తేమను గ్రహిస్తుంది. దీంతో జుట్టు మరింత పొడిగా మారుతుంది. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు తేమ తిరిగి వస్తుంది. స్కాల్ప్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
హీట్ స్టైలింగ్ నివారించండి:
శీతాకాలంలో జుట్టు పొడిగా మారుతుంది. అందుకోసం.. బ్లో డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు, కర్లర్ల వంటి హీట్ స్టైలింగ్ వంటివి వాడుతారు. అవి జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. ఇవి వాడటంవల్ల జుట్టు చిట్లిపోయి, చివర్లు చిట్లిపోతాయి. వీలైనంత వరకు హీట్ స్టైలింగ్‌కు దూరంగా ఉండండి.
షాంపూ తక్కువగా వాడండి:
జుట్టుకు రక్షణ కల్పించే సహజ నూనెలను కలిగి ఉంటుంది. తరచుగా షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజమైన ఆయిల్ తొలగిపోతుంది. దీనివల్ల జుట్టు పొడిబారడంతోపాటు చిట్లిపోతుంది. చలికాలంలో ప్రతిరోజూ షాంపూ చేయడం మానుకోండి. షాంపూ చేయడానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంచండి. స్కాల్ప్ దాని సహజ నూనెను నిర్వహించడానికి సమయం ఇవ్వండి. ప్రతి 3 రోజులకు ఒకసారి జుట్టును శుభ్రం చేయడానికి తేలికపాటి షాంపూని ఉపయోగించండి.
వీక్లీ డీప్ కండిషనింగ్ చేయండి:
చల్లని, పొడి గాలి వల్ల జుట్టు చిట్లడం.. బలహీనమవుతుంది. వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ లేదా హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం ద్వారా జుట్టుకు తేమ, పోషణను అందించాలి. చలికాలంలో వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బ్రేకేజ్ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!