హైదరాబాద్‌లోని ప్రణామ్ ఆసుపత్రి ఓ రోగి ప్రాణాలను కాపాడింది. ప్రణామ్ హాస్పిటల్స్ కి చెందిన సర్జికల్ బృందం ఒక రోగి కడుపులో నుంచి 8.5 కిలోల భారీ అండాశయ కణితిని తొలగించింది. అధునాతన వైద్య పరికరాలు, పలు విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఈ ఆస్పత్రి బృందం కణితిని విజయవంతంగా తొలగించి మరో మైలురాయిని సాధించింది. ఈ వ్యాధి బారిన పడిన రోగి మధ్య వయస్కురాలు. ఆమె కొన్ని నెలలుగా కడుపులో తీవ్రమైన అసౌకర్యం, నొప్పి, వాపుతో బాధపడుతున్నారు. రోగిని సమగ్రంగా పరీక్షించిన వైద్య బృందం రోగాన్ని కనుగొనేందుకు పలు పరీక్షలు నిర్వహించింది. కడుపులో పెద్ద అండాశయ కణితి ఉన్నట్లు నిర్ధారించింది. వాస్తవానికి ఈ కణితి అధిక పరిమాణంలో ఉంది. దీని కారణంగా శస్త్రచికిత్స చేయడం చాలా కష్టతరంగా మారింది. కానీ.. అనేక సవాళ్లను ఎదుర్కొన్న సర్జికల్ బృందం దాన్ని తొలగించి చివరికి విజయం సాధించింది.
READ MORE: Breakup Benefits: బ్రేకప్ వల్ల కలిగే లాభాల గురించి తెలుసా?
ఈ శస్త్రచికిత్స చేసేందుకు ఖచ్చితమైన ప్రణాళికలు, సమన్వయం అవసరం. శస్త్రచికిత్స సిబ్బందితో పాటు గైనకాలజికల్ ఆంకాలజిస్టులు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు బృందం ప్రణాళికాబద్ధంగా ఆపరేషన్ ప్రక్రియ నిర్వహించింది. ఆపరేషన్ సమయంలో ఎటు వంటి ప్రతికూల ఫలితాలు రాకుండా జాగ్రత్త పడింది. కడుపులో అండాశయ కణితి ఉన్నప్పుడు దాన్ని త్వరగా గుర్తించాలి. సమయం పెరిగే కొద్ది కణితి పరిమాణం క్రమంగా పెరుగుతుంది. ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కడుపునకు సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని.. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఈ కేసు సూచిస్తోంది. కాగా.. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి ప్రాణాలను కాపాడినందుకు రోగి తరఫు బంధువులు ప్రణామ్ ఆస్పత్రి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
READ MORE: MS Dhoni: సహనం కోల్పోయిన ఎంఎస్ ధోనీ.. బౌలర్‌కు చివాట్లు (వీడియో)
ప్రణామ్ హాస్పిటల్స్..
ప్రణామ్ హాస్పిటల్ అత్యాధునిక వైద్య సేవలు, అనుభవజ్ఞులైన నిపుణులకు ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతం చేసింది. ఆస్పత్రిలో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలతో పాటు ఎలాంటి రోగాలను ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై పూర్తి పరిజ్ఞానం ఉన్న వైద్యులు ఉన్నారు.