Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
- పాతకాలం నాటి పోషకాహారం జొన్న సంగటి
- రాయలసీమ స్పెషల్ వంటకం తయారీ ఇలా
- డయాబెటిస్, బరువు నియంత్రణకు బెస్ట్ ఫుడ్
- పచ్చళ్లతో తింటే అద్భుతమైన రుచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jonna Sangati Recipe in Telugu : నేటి యాంత్రిక జీవనంలో మనం మన సంప్రదాయ ఆహారాలను మర్చిపోతున్నాం. పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకునే చిరుధాన్యాల ఆహారమే. అటువంటి బలమైన, రుచికరమైన వంటకాల్లో జొన్న సంగటి (జొన్న బువ్వ) ఒకటి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని పక్కాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
- Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
- జొన్నలు: 1 కప్పు (తెల్ల లేదా పచ్చ జొన్నలు)
- నీళ్లు: 4 నుండి 5 కప్పులు
- ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
1. జొన్నలను నానబెట్టడం:
ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకుని శుభ్రంగా కడిగి, కనీసం 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల జొన్నలు మెత్తగా ఉడకడమే కాకుండా త్వరగా జీర్ణమవుతాయి.
2. జొన్న రవ్వ తయారీ:
నానిన జొన్నలలోని నీటిని పూర్తిగా వడకట్టాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా (రవ్వలా) గ్రైండ్ చేసుకోవాలి.
3. ఎసరు మరిగించడం:
స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి, ఒక కప్పు జొన్న రవ్వకు సుమారు 4 నుండి 5 కప్పుల నీటిని పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
4. ఉడికించే విధానం:
నీళ్లు మరుగుతున్నప్పుడు, సిద్ధం చేసుకున్న జొన్న రవ్వను వేస్తూ గరిటతో ఉండలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుకోవాలి. మంటను తక్కువగా ఉంచి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ దగ్గరపడే వరకు ఉడికించాలి. మీరు కుక్కర్లో వండుతున్నట్లయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సంగటి చాలా మెత్తగా వస్తుంది.
5. ముద్దలు చేయడం:
మిశ్రమం దగ్గరపడి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నీరు లేదా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
సర్వింగ్ టిప్..
ఈ జొన్న సంగటిని వేరుశనగ పచ్చడి, టమాటో పచ్చడి లేదా ఏదైనా నాటు కోడి పులుసు వంటి కూరలతో తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇది కేవలం రుచిలోనే కాదు, శరీరానికి కావలసిన శక్తిని అందించడంలోనూ మేటి. డయాబెటిస్ ఉన్నవారికి , బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక పోషక విలువల నిధి అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!