Pets: మనలో చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. అందులో కొందరు జంతువులని పెంచుకుంటూ ఉంటారు. ఇలా జంతువులని పెంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచింది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మనసు ఆరోగ్యంగా ఉంటె మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా జంతువులను పెంచుకోవడం వల్ల మాసిక ఆనందం తో పాటు అబుద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి పెంపుడు జంతువుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Share Market Opening : వరుసగా రెండో రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. అసలేం జరుగుతోంది?
మనం ఏదైనా జంతువుని పెంచుకుంటున్నప్పుడు కాసేపు దానితో ఆడుకుంటాము. అలానే అవి స్వేచ్ఛగా ఆడుకుంటున్నప్పుడు చూస్తూ ఉంటాం. ఇలా పెంపుడు జంతువులతో ఆడుకోవడం లేదా అవి హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చూడడం వల్ల ఒత్తిడిని కలిగించే “కార్టిసాల్” స్థాయి తగ్గుతుంది. అలానే ఆనందాన్ని ప్రేరేపించే “సెరోటోనిన్” హార్మోన్ పెరుగుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అలానే పెంపుడు జంతువులతో కాస్త సమయం గడపడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలానే గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలానే కుక్కలకి మానవ శరీరంలో జరిగే మార్పులని గ్రహించే శక్తి ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారిలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కోసారి అమాంతం పడిపోతుంటాయి. అలాంటి సందర్భాలని కుక్కలు ముందే గ్రహించి హెశ్చరిస్తాయి. దీని వల్ల ముందస్తు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.