Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
- మూడు పదార్థాలతో హోమ్ మేడ్ మౌత్ వాష్
- అల్లంతో నోటికి తక్షణ ఫ్రెష్‌నెస్
- బేబీ బ్రష్‌తో పూర్తి శుభ్రత
- నోటి దుర్వాసనకు అసలు కారణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bad Breath Remedies in Telug : కొంతమందికి ఉదయం బ్రష్ చేసినా, ఎంత శుభ్రంగా ఉన్నా నోటి నుంచి వచ్చే దుర్వాసన (Halitosis) వదలదు. దీనివల్ల పక్కవారితో మాట్లాడాలంటేనే భయం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటివి జరుగుతుంటాయి. దంతాల మధ్య ఆహార కణాలు ఇరుక్కుపోవడం, చిగుళ్ల సమస్యలు లేదా నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది ఈ దుర్వాసన వస్తుంది. అయితే, దీనికి ఖరీదైన మౌత్ వాష్‌లే వాడక్కర్లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే అద్భుతమైన పరిష్కారం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
1. మూడు పదార్థాలతో అద్భుతమైన హోమ్ మేడ్ మౌత్ వాష్
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
కావలసినవి:
- గోరువెచ్చని నీరు: 200 మి.లీ (సుమారు 2 కప్పులు)
- బేకింగ్ సోడా: 1 టీస్పూన్
- నిమ్మరసం: సగం నిమ్మకాయ నుంచి తీసినది
- తెల్ల ఉప్పు: 1 టీస్పూన్
వాడే విధానం:
ఈ మూడింటిని నీటిలో కలిపి ఒక మిశ్రమంలా తయారుచేసుకోండి. ఈ ద్రావణంతో నోటిని కనీసం 30 సెకన్ల పాటు బాగా పుక్కిలించి (Gargle) ఉమ్మివేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చిగుళ్లలోని, నాలుకపై ఉన్న బ్యాక్టీరియా నశించి శ్వాస తాజాగా మారుతుంది.
2. అల్లం ముక్కతో ‘రిఫ్రెష్’ అయ్యే చిట్కా
అల్లం ఆహార రుచికే కాదు, నోటి దుర్వాసనను పోగొట్టడానికి కూడా గొప్పగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే ‘జింజెరాల్’ అనే సమ్మేళనం లాలాజలంలోని ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. ఇవి నోటిలో దుర్వాసనను కలిగించే సల్ఫర్ సమ్మేళనాలను విచ్ఛిన్నం చేస్తాయి.
ఎలా చేయాలి?: బ్రష్ చేసిన తర్వాత ఒక చిన్న తాజా అల్లం ముక్కను నోటిలో వేసుకుని రెండు నిమిషాల పాటు దంతాలతో నమలాలి. ఇది మీ నోటిని తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది.
3. బేబీ బ్రష్ ఎందుకు వాడాలి?
చాలామంది పెద్ద బ్రష్‌లను వాడుతుంటారు, కానీ అవి నోటిలోని అన్ని మూలలకు చేరుకోలేవు. అందుకే నిపుణులు బేబీ బ్రష్‌లను వాడమని సిఫార్సు చేస్తున్నారు. ఈ బ్రష్‌లు చిన్నవిగా ఉండటం వల్ల దంతాల సందుల్లోకి, నోటి వెనుక భాగాలకు సులభంగా చేరుకుని అక్కడ పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ప్రతిరోజూ ఉదయం కనీసం 90 నుండి 120 సెకన్ల పాటు పళ్ళు తోముకోవడం తప్పనిసరి.
4. నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు ఇవే..
- నాలుకను శుభ్రం చేయకపోవడం: నాలుకపై తెల్లటి పొరలా పేరుకుపోయే బ్యాక్టీరియా దుర్వాసనకు 80% కారణమవుతుంది.
- చిగుళ్ల వ్యాధులు: పైరోరియా లేదా చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు.
- నోరు పొడిబారడం: లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.
- విటమిన్ల లోపం: కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల కూడా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
నిత్యం పళ్ళు తోముకోవడంతో పాటు, నాలుకను శుభ్రం చేసుకోవడం , నిపుణులు సూచించిన ఈ సహజ సిద్ధమైన మౌత్ వాష్ చిట్కాను పాటిస్తే నోటి దుర్వాసన అనే మాటే ఉండదు. అయితే సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే మాత్రం ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..