Curd Health Benefits: పెరుగు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు, వైద్యులు తరుచుగా చెబుతుంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా, విటమిన్లు, మినరల్స్ కలిసి ఉంటాయి. కడుపులోని యాసిడ్ స్థాయిలను సమతుల్యత కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పోషకాలు నిండుగా ఉండే ఆహారపదార్థం పెరుగు. ప్రతిరోజూ పెరుగును తీసుకుంటే లాక్టోబాసిల్లస్, లక్టోకోకస్, స్ట్రప్టోకోకస్ వంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు మన శరీరానికి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతాయి. పేగుల వాపు, బరువుపెరుగుట,…