ఈరోజుల్లో ఎక్కువమందికి 30 ఏళ్లు దాటగానే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం కామన్..దీనికి ప్రధాన కారణం ప్రస్తుత అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు.. టైం కు తినకపోవడం వల్లే అనేక రకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. వివిధ పానీయాలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందులో అలోవెరా జ్యూస్ ఒకటి. ఈ జ్యూస్ తయారీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కలబంద రసం ఔషధ గుణాలతో నిండి ఉంది. ఆయుర్వేదంలో కూడా కలబంద మరియు ఉసిరికాయలు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది.. ఇక ఈ జ్యూస్ ను వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. కలబంద, ఉసిరికాయ జ్యూస్ లో కాల్షియం, శక్తి, సోడియం, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కొవ్వు, పొటాషియం, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, జీర్ణక్రియ లక్షణాలు, రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉన్నాయి.. అదే విధంగా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి..
*. ఈరోజుల్లో కొత్త కొత్త వ్యాదులు వస్తున్నాయి.. వాటి నుంచి తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తి బాగుండాలి.. ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
*. శరీరంలో విటమిన్ సి స్థాయిలను సులభంగా పెంచుకోవాలనుకుంటే ఈ జ్యూస్ ను ఉదయం తాగాల్సిందే..
*. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. మరియు మీరు ఈ జ్యూస్‌తో కొంత సీతాఫల రసాన్ని తాగినప్పుడు, ఇది ప్యాంక్రియాస్ యొక్క కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది.. రక్తంలో చక్కర శోషణను పెంచడానికి బాగా సహాయపడుతుంది..
*. గోరువెచ్చని పాలతో ఉసిరికాయ మరియు కలబంద రసాన్ని తీసుకుంటే గొంతులో కూరుకుపోయిన శ్లేష్మం క్లియర్ అవుతుంది.. కాస్త నెయ్యి వేసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి…
ఈ జ్యూస్ ను ఇలా రోజూ తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.