గత కొద్ది రోజులుగా వర్షాలు వీడకుండ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. మరోవైపు, ఈ సీజన్‌లో మంచి స్పైసీ ఫుడ్ లభిస్తే.. అస్సలు వదలకుండా తింటారు.. అలాంటి పొరపాటు చెయ్యొద్దని నిపుణులు అంటున్నారు..అయితే, ఈ సీజన్‌లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కాంబినేషన్‌లో మీకు సమస్యలు వస్తాయి. ఇవి కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. వర్షాకాలంలో మనకు హాని కలిగించే ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండీ..
*.వర్షాకాలంలో నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లతో పాలు, పెరుగు లేదా పనీర్ వంటి పాల ఉత్పత్తులను కలిపి తినకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే యాసిడ్ డైరీ కడుపులో పేరుకుపోయేలా చేస్తుంది. దీని కారణంగా మీరు అసౌకర్యానికి గురికావచ్చు. మీకు అజీర్ణం ఉండవచ్చు..
*. ఆహారం తిన్న వెంటనే పండ్లు తినడం కూడా మానేయాలి. ఇది మీ కడుపులో కిణ్వ ప్రక్రియకు కారణమవుతుంది. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. ఇతర ఆహారాలతో కలిపినప్పుడు ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది..
*. పాల ఉత్పత్తులతో కాఫీ లేదా టీ వంటి కెఫిన్ కలపడం యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కెఫీన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది పాలతో కలిపినప్పుడు పెరుగుతుంది..
*. రెడ్ మీట్, చికెన్ మాంసం, రైస్ బ్రెడ్, బంగాళదుంపలు వంటి పిండి పదార్ధాలతో మాంసాన్ని కలపడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కలయికకు వివిధ జీర్ణ ఎంజైమ్‌లు అవసరమవుతాయి, ఇవి మీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి.. అందుకే వర్షాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్ళకండని నిపుణులు చెబుతున్నారు..
*. కూల్ డ్రింక్స్ అస్సలు తింటూ తాగకూడదు.. అందులో కార్బోనేటేడ్ డ్రింక్స్ వంటి పానీయాలు తినేటప్పుడు తీసుకోవడం అలవాటు. ఇది మీ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. చల్లని ఉష్ణోగ్రత రక్త నాళాలను కుదించగలదు. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది..
*.వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఇప్పటికే నెమ్మదిగా పని చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కారంగా , వేయించిన ఆహారాన్ని కలిపి తింటే, అది మీ జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. ఇది అజీర్ణం, అసౌకర్యానికి దారి తీస్తుంది. సులభమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి తేలికపాటి వంట పద్ధతులను ఎంచుకోండి.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. అది ఈ కాలం లైట్ గా తీసుకోవడం చాలా మంచిది..