మనం బెల్లంతో ఎన్నో రకాల వంటలను చేసుకొని తింటాము.. అయితే దాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే రోజూ తీసుకుంటారు.. బెల్లంతో కలిపి పల్లీలు తీసుకున్నా, లేదా బెల్లంతో కలిపి కొబ్బరి తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే ఈ బెల్లం ముక్కను ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయి. అలాగే బెల్లాన్ని, ధనియాలను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్లు వాపు, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. నేటి తరుణంలో మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు…
అలాగే బెల్లాన్ని, ధనియాలను తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్లు వాపు, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. నేటి తరుణంలో మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బెల్లాన్ని, ధనియాలను రోజూ రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది…అంతేకాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా రక్తహీనత, రక్తపోటు సమస్యతో బాధపడే వారు బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకుంటే ఆ సమస్యలు పూర్తిగా మాయం అవుతాయి..
అలాగే శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఈవిధంగా బెల్లాన్ని, ధనియాలను కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజూ పావు టీ స్పూన్ బెల్లం తురుములో, అర టీ స్పూన్ ధనియాల పొడిని కలిపి తీసుకోవాలి.. ఏదైనా లిమిట్ గానే తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో సమస్యలను దూరం చేస్తున్న ఈ చిట్కాను మీరు పాటించండి..