నాన్ వెజ్ ప్రియులు చికెన్, ఫిష్ మాత్రమే కాదు మటన్ ను కూడా ఎక్కువగా తింటారు.. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.. మటన్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రెడ్ మీట్ ను వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.. మటన్ ను ఎక్కువగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఈ మాంసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని గుండె సంబంధిత సమస్యలతో పాటు మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. రెడ్ మీట్ ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరుగుతుందని వారు చెబుతున్నారు… ఇంకా ఈ మాంసాన్ని ఎక్కువగా ఎక్కువగానే కాదు వేయించి తీసుకున్నా కూడా ప్రమాదమే అంటున్నారు.. శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని చెబుతున్నారు..
ఈ మటన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.. ఇవి క్రమంగా గుండె జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉంది. అయితే బీఫ్, పోర్క్ మాంసంతో పోల్చిననప్పుడు మేక మాంసంలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. కనరుక మేకమాంసం ఒక ప్రత్యామ్నాయంగానే చెప్పవచ్చు. ఈ విధంగా రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అందుకే మటన్ ను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు..ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వారు వీటిని తీసుకోవడం పూర్తిగా తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని వీలైనంత వరకు తక్కువ నూనెలో ఉడికించి తీసుకునే ప్రయత్నం చేయాలని నూనె వేసి వేయించి గ్రిల్ చేసి తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.. సో మటన్ ప్రియులు ఇది ఒకసారి ఆలోచించండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.