మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. కెఫినేటెడ్ డ్రిక్స్‌కు దూరంగా ఉండాలి.. వీటితో కొన్నిటిని పరగడుపున తీసుకొకూదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ కాఫీ తీసుకోకూడదు. డీకెఫినెటెడ్ కాఫీలకు కూడా దూరంగా ఉండటం మంచిది. కాఫీ మన కడుపులో యాసిడ్స్‌ను సృష్టిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే గుండెల్లో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. బ్రేక్ ఫాస్ట్‌కు ముందే కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే.. శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.. ఇది ఒత్తిడిని పెంచుతుంది..
ఇక కొంతమందికి పొద్దున్నే లేవగానే ఆల్కహాల్ ను తీసుకుంటారు.. అది చాలా ప్రమాదం.. పరగడుపున మద్యం తాగితే, శరీరం దాన్ని సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా శోషించుకుంటుందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మన శరీరం ఆల్కహాల్‌ను తొలగించే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది.. కొన్ని అవయవాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది..
పొద్దున్నే జంక్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు తీసుకుంటే శరీర అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది..
ఇకపోతే నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో ఫైబర్‌తో పాటు యాసిడ్స్ ఉంటాయి. ఖాళీ కడుపుతో ఇలాంటి పండ్ల రసాలు తీసుకుంటే కడుపులో చికాకుగా అనిపించవచ్చు.. వికారంగా అనిపించడంతో పాటు.. జీర్ణ సమస్యలు పెరుగుతాయి..
ఇక చివరగా చూయింగ్ గమ్స్ జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి అధికమైతే, పేగుల సున్నితమైన పొరకు హాని కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే గ్యాస్ట్రిటిస్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వీటన్నికన్నా లేవగానే మంచి నీళ్లు తాగడం మంచిది.. కొందరు వేడి నీళ్లు కూడా తాగుతారు.. ఇవి కూడా మంచిదే..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.