పప్పులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు ప్రొటీన్ లోపాన్ని తీర్చడానికి పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తారు.. తృణ దాన్యాలలో ఒకటి పెసరపప్పు.. పెసరపప్పులో అనేక పోషకాలతో పాటు జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ పెసరపప్పులో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చ పెసరపప్పు సహాయం చేస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని.. పచ్చ పెసరపప్పు కాలేయానికి కూడా చాలా మంచిదని భావిస్తారు.. డయాబెటిస్ పేషంట్స్ కు ఇవి చాలా మంచిది.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చ పెసరపప్పు పొట్టుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది.. చర్మ కాంతిని పెంచుతుంది..
ఈ పప్పును సౌందర్య సాధనాల్లో కూడా వాడుతారు.. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కెమికల్ సబ్బులకు ప్రత్యామ్నాయంగా పచ్చ పెసరపప్పు పొడిని ఉపయోగించవచ్చు. పచ్చ పెసరపప్పు పొడిని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.. పిల్లలకు కావలసిన ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి.. వారికి పెసలను ఏదొక రూపంలో ఇవ్వడం మంచిది.. ఇక పెసలతో అనేక రకాల వంటలను చేసుకోవచ్చు.. కాబట్టి వారానికి రెండు సార్లు అయిన ఈ పెసలను తీసుకోండి.. ఒక్క పెసరపప్పు మాత్రమే కాదు అన్ని పప్పులు కూడా శరీరానికి మంచివే.. మాంసం తినని వాళ్లకు ఇవే సరైన పోషకాలను అందిస్తూన్నాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు.. రోజూ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు.. ఏదైనా తక్కువగా తీసుకోవడం మంచిది.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..