గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజుకు ఒక గుడ్డు లేదా రెండు గుడ్లు తినడం వల్ల కండరాలను సరిచేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ ఇస్తుంది.. ఒక గుడ్డు కన్నా ఎక్కువ తీసుకుంటే శరీరంలో క్యాలరీలు కూడా పెరుగుతాయి.. దాంతో శరీరంలో కొవ్వు భారీగా పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డులో ఉండే తెల్లసొనలో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తినాలి. వీటిలో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి.. ఉడికించిన గుడ్డు శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో ఉడికించిన గుడ్డు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. మెదడు పని తీరు మెరుగు పడుతుంది.. గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సెలీనియం, విటమిన్లు ఉంటాయి.. సో బరువును తగ్గాలని అనుకొనేవారు రోజుకు ఒక గుడ్డును అది కూడా తెల్ల గుడ్డును తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.