Health Tips: తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేయకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips: చాలా మంది తిన్న వెంటనే కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేసే పనులు శరీరంపై ఎన్ని రకాల ప్రభావాలను చూపుతాయో తెలిస్తే షాక్ అవుతారు. బాబోయ్ వెంటనే మీరు తిన్న తర్వాత చేసే పనులు ఏంటో ఒక గుర్తు చేసుకోండి.. ఈ స్టోరీలో తిన్న తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం. పొరపాటున ఈ స్టోరీలో చెప్పిన పనులు కనుక మీరు చేస్తుంటే వెంటనే ఆపి వేయడం చాలా ఉత్తమం.. ఇంతకీ ఏంటా పనులు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Suriya : వరుస ఫ్లాపులు.. రూట్ మార్చిన సూర్య
Also Read
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం, నిద్ర పోవడం.. లాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. ఆ చాలా మందిలో మీరూ కూడా ఉన్నారా బాస్.. వెంటనే ఆపేసేయండి. ఈ వ్యాపకాలను ఎంత త్వరగా మానుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు వైద్య నిపుణులు. చాలామందికి తెలిసో, తెలియకో చేసే ఈ పొరపాట్ల వారి జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుందని అంటున్నారు.
పొరపాటున కూడా స్నానం చేయకూడదు..
కొందరు తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. వెంటనే ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. తెలిసో తెలియకో చాలా మంది అయితే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. దీని కారణంగా రక్తప్రసరణపై ప్రభావం పడి శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయని చెబుతున్నారు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని, దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే స్నానం చేయమంటున్నారు.
ఏదో ఒక పండను తినడం ఉత్తమం..
ఏదో ఒక పండును తిన్న వెంటనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. కొందరు వైద్యులు మాట్లాడుతూ.. ఇది నిజమే అయినా భోంచేశాక పండ్లు తీసుకునే కంటే అల్పాహార సమయంలో తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు వాళ్లు చెప్పేది ఏంటంటే పండు తినాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్‌మీల్‌గా (అల్పాహారం, లంచ్‌కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
కచ్చితంగా గంట తర్వాతనే..
పలువురు నిపుణులు మాట్లాడుతూ.. భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే వీటివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్.. వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇందుకు టీ/కాఫీలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట. అందుకే తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో వీటిని తాగితే ఎలాంటి సమస్యా ఉండదట.
చాలా మంది తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేస్తుంటారు. ఇది చాలా డెంజర్ అంటున్నారు డాక్టర్లు.. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి సహకరించే ఎంజైమ్స్, జీర్ణ రసాలు.. వంటివి పొట్టలో తక్కువగా ఉత్పత్తవుతాయట. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
READ ALSO: Tollywood : ప్లాప్ సినిమాకు అవార్డు.. అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాపైనే
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!