Health Tips: అసలే చలికాలం, ఎన్ని జాగ్రత్తలు పాటించినా జలుబు నుంచి తప్పించుకోలేం. వాస్తవానికి చాలా మంది తరచుగా తుమ్ములు రావడాన్ని జలుబు అని అనుకుంటారు. కానీ తరచుగా తుమ్ములు రావడం అనేది అలెర్జీకి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య సకాలంలో పరిష్కరించుకోకపోతే, అది తలనొప్పి, సైనస్ వంటి ప్రధాన సమస్యలకు దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి పాటించాల్సిన హోమ్ టిప్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Prabhas: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ప్రభాస్ షాకింగ్ కామెంట్
చలికాలంలో గాలి పొడిగా మారుతుంది, ఇదే టైంలో ముక్కులోని తేమ తగ్గిపోతుంది. అంతేకాకుండా కాలుష్యంతో కూడుకున్న చల్లని గాలి ప్రత్యక్షంగా ముక్కును తాకిన టైంలో దురద, చికాకు కలుగుతుంది. ఆ టైంలో కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అలాగే నిద్రకు అంతరాయం కలుగుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
ఈ హోమ్ టిప్స్ ట్రై చేయండి..
* బయటకు ఎప్పుడు వెళ్లిన ముక్కుకు చల్లని గాలి తగలకుండా చూసుకోవాలి.
* ఉదయం, సాయంత్రం ఆవిరి తీసుకోవాలి. ఇది ముక్కు రంధ్రాలను తేమగా ఉంచడంలో సహాయం చేస్తుంది. అదే సమయంలో చికాకును తగ్గిస్తుంది. అలాగే చల్లటి నీరు తాగకుండా ఉండాలి.
* పడుకునే ముందు ముక్కులో రెండు చుక్కల నువ్వుల నూనె వేసుకోవాలి. ఇది ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఇది ముక్కు పొడి బారకుండా ఉంచుతుందని చెప్పారు.
* రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగాలి. ఇది శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇది బయట వాతావరణం ప్రభావాల నుంచి కూడా రక్షిస్తుంది.
* ప్రతిరోజూ కొంత సమయం ఎండలో గడపాలి. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. దీంతో ముక్కు ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
READ ALSO: China: 2 సెకన్లలో 700 kmph! చైనా కొత్త సూపర్ రైలు చూశారా!