ఆలుగడ్డలు ( బంగాళ దుంపలు) ఎక్కువగా తినడం చాలా డేంజర్ అని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్ట్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయంటున్నారు. వీటిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక శాతం ఉంటాయి. ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కానీ.. వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.
Read Also: Premi Viswanath: భర్తకు దూరమైపోతున్నా.. వంటలక్క షాకింగ్ కామెంట్స్
ఆలూ ఎక్కువగా తీసుకోవడంతో జీర్ణ సమస్యలతో పాటు.. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయని.. ఆరోగ్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా తినడంతో… పోషకాల అసమతుల్యత.. ఏర్పడుతుందంటున్నారు. అయితే బంగాళ దుంపలను ప్రై లాగా వండుకుని తినడం.. అదే విధంగా చిప్స్ లా తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల అధిక రక్తపోటు, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారు కూడా వీటికి తినకపోవడం ఉత్తమం.
Read Also: Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు
షుగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నావారు ఆలుగడ్డలను పూర్తిగా బ్యాన్ చేస్తే మంచిందని అంటున్నారు న్యూట్రిషియన్స్. వీటిని ఎక్కువగా తీసుకోవడంతో ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయంటున్నారు. బంగాళదుంపల్లో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉండడంతో.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతుందని.. కాబట్టి వీటికి డయాబెటిస్ పేషెంట్లు తినకపోవడమే మంచిదంటున్నారు. అయితే మేము ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి గ్రహించాం.. మీరు వీటిని ఫాలో అయ్యే ముందు.. డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.