ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలడం వల్ల త్వరగా బట్టతల కూడా వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి జుట్టుకు పోషకాలు అందకపోవడం. జుట్టు రాలడం అనేది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా సమస్య. కానీ ఈ సమస్య మగవారిలో ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పురుషులు దీని వల్ల డిప్రెషన్ కు లోనవుతున్నారు.
అందాన్ని పెంచడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారితే అది అందాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు . అయితే కొత్త జుట్టు పెరగడానికి, బట్టతల సమస్య నుండి బయటపడటానికి కొన్ని సహజమైన మార్గాల పాటించడం ద్వారా బట్టతల సమస్య నుండి బయటపడొచ్చు. కాబట్టి జుట్టు రాలిపోయి డిప్రెషన్‌లో ఉన్న వారి కోసం కొన్ని అద్భుతమైన సహజ నివారణలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు అవేంటో చూసేద్దాం…
1. ఉల్లిపాయ
ఉల్లిపాయల్లోని సల్ఫర్ తలకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. దీంతో బట్టతల సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఉల్లిపాయను కోసి గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో తేనె కలిపి తలకు పట్టించి కాసేపు బాగా మసాజ్ చేయాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణను పెంచడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.
2. ఆముదం
బట్టతల సమస్యను దూరం చేయడంలో ఆముదం నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది అనేక జుట్టు, చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. బట్టతల నుండి బయటపడాలంటే నూనెను వేలితో తలకు రాసుకుని కాసేపు మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది.
3. కలబంద
కలబంద అనేది హెర్బాషియస్ ప్లాంట్, ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు,చర్మ సమస్యలను దూరం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రధానంగా అలోవెరా జెల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలోవెరా జెల్ ను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే జుట్టు ఎదుగుదలలో చక్కని మార్పును చూడవచ్చు. ఎందుకంటే ఇది జుట్టు మూలంలో మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తుంది.
4. మెంతి
బట్టతలని తొలగించడంలో మెంతులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెంతులను నీళ్లలో నానబెట్టి, మెత్తగా రుబ్బుకుని, తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచి, జుట్టును శుభ్రం చేసుకోవాలి.
ఈ విధమైన చిట్కాలను క్రమం తప్పకుండ పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.