Hair Fall: జుట్టు రాలడం చాలామంది ప్రధాన సమస్యగా మారుతోంది. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి, తలస్నానానికి వాడే నీరు.. ఇలా చాలా విషయాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..
READ MORE: Bandi Sanjay : కేటీఆర్ పరువు నష్టం కేసుపై బండి స్పందన.. ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫైర్
జుట్టు రాలకుండా ఉండాలంటే మీ ఫుడ్లో నట్స్ యాడ్ చేసుకోండి. ఈ క్రమంలో రోజూ ఏడు బాదం పప్పులు, రెండు వాల్నట్స్ తినాలి. అలాగే.. టీస్పూన్ చొప్పున సబ్జా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడచ్చు. పరగడుపునే టీస్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ప్రొటీన్ జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఇందుకోసం రోజూ మూడు కోడిగుడ్ల తెల్లసొనలు, ఒక పచ్చసొన తీసుకోవడం మంచిది. శరీరంలో బి12 విటమిన్ లోపముంటే కొత్త జుట్టు పెరిగేందుకు ఇది అడ్డు పడుతుంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేయాలంటే ఈ విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ‘డి’ విటమిన్ లోపం వల్ల అలొపేసియా (జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం) సమస్య తలెత్తుతుంది. కాబట్టి తగిన మోతాదులో డి విటమిన్ తీసుకోవాలి. అలాగే విటమిన్ ‘సి’ కూడా శరీరానికి తగినంత అందాలి. మరీ అత్యవసరమైన సందర్భాలలో డాక్టర్ సలహా మేరకు ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే సాధ్యమైనంతవరకు సప్లిమెంట్ల కన్నా ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరీ మంచిది అన్నది నిపుణుల అభిప్రాయం.
READ MORE: Little Hearts : బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా “లిటిల్ హార్ట్స్”..కలెక్షన్స్ ఎంతంటే?