తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే విధంగా తలస్నానం చేసే ముందుకు కొన్ని టిప్స్ పాటించాలి.. జుట్టుకు షాంపు చేసే ముందు జుట్టుకి నూనె రాయడం వల్ల జుట్టుకు తేమని అందిస్తుంది. దీని వల్ల షాంపూలోని హానికరమైన ప్రభావాల నుండి కాపాడుతుంది. షాంపూ చేయడానికి ముందు, కొబ్బరి నూనె, ఆలివ్ నూనెతో జుట్టుని మసాజ్ చేయాలి.. జుట్టు మెరుస్తుంది.. ఇక షాంపు చెయ్యడానికి ముందు పాటించాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం..
*. మీరు షాంపూ చేయడానికి ముందు జుట్టులో ఎలాంటి చిక్కులు లేకుండా బాగా దువ్వండి. దీంతో షాంపూ జుట్టుని మెరుగ్గా చేస్తుంది. వెడల్పాటి పండ్ల దువ్వెనతో జుట్టుని బాగా దువ్వండి. ఇది షాంపూ చేసేటప్పుడు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
*. తలకు షాంపు వేసే ముందు జుట్టుకు కొద్దిగా వేడి, చల్లని నీళ్లను వేసి కొద్ది సేపు వదిలెయ్యండి..
*. సరైన మొత్తంలో షాంపూ వాడండి. ఎక్కువగా షాంపూ వేస్తే జుట్టు బలహీనమవుతుంది. మీరు షాంపూని వాడినప్పుడు దానిని గుండ్రంగా మసాజ్ చేయండి. తర్వాత షాంపూ నురగ మొత్తం పోయేలా నీటితో బాగా కడగాలి..
*. తలకు నీళ్లు పోయే వరకు మెత్తనిక్లాత్ ను చుట్టి జుట్టు పొడిగా అయిన తర్వాత జుట్టును దువ్వడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.